చిక్కుల్లో అమల ‘కారు’

మరిన్ని వార్తలు

నటి అమలా పాల్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వివాదాల కారణంగానే వార్తలో నిలిస్తున్నారు. మొదటగా ఆమె భర్త నుండి విడిపోవడం ద్వారా పతాక శీర్షికలలోకి ఎక్కిన అమల ఇప్పుడు మరొక కొత్త వివాదంతో మళ్ళీ తెరపైకి వచ్చారు.

వివరాల్లోకి వెళితే, అమలా పాల్ ఈ మధ్యనే ఒక బెంజ్ కారు కొనుగోలు చేశారు. అయితే సదరు కారుని రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఆమె తప్పుడు దృవీకరణ పత్రాలు సమర్పించడం ద్వారా ప్రభుత్వానికి పన్ను ఎగవేశారు అన్నది ఆమె పైన ఆరోపణ.

ఇక ఆమె ఈ తప్పుడు దృవీకరణ పత్రాలు సమర్పించినందుకు ఆమెకి దాదాపు 5 నుండి 7 ఏండ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది అని అందరు అంటున్న నేపధ్యంలో పాండిచ్చేరి కి చెందిన రవాణ శాఖ మంత్రి వివరణ ఇవ్వడం జరిగింది.

“మన దేశంలో ఏ ప్రాంతంలో కొన్న వాహనాన్ని అయిన మరొక ప్రదేశంలో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉన్నందున ఆమె చేసిన దాంట్లో ఎటువంటి తప్పులేదు అని వివరణ ఇచ్చాడు”.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS