అమలాపాల్.. తెలుగులో కొన్నాళ్లు మెరిసిన కేరళ హీరోయిన్. అల్లు అర్జున్, రామ్ చరణ్ సినిమాల్లో నటించింది. ఆ తరవాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది. దర్శకుడు విజయ్ ని ప్రేమించి, పెళ్లి చేసుకొని, ఆ తరవాత విడిపోయింది. అమలాపాల్ ప్రేమ వ్యవహారాల కంటే, ఆమె విజయ్‌ని పెళ్లాడి విడాకులు తీసుకోవడం ఎక్కువ చర్చనీయాంశమైంది. ఇప్పుడు అమలాపాల్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. తనని తన మాజీ ప్రియుడు లైంగికంగా వేధిస్తున్నాడని, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది అమలాపాల్. అంతే కాదు.. మరో 11 మందిపైనా కేసు పెట్టింది. పోలీసులు కూడా త్వరిత గతిన యాక్షన్ తీసుకొని అమలాపాల్ మాజీ ప్రియుడ్ని అదుపులోకి తీసుకోవడం విశేషం.
పవీందర్ అనే వ్యక్తితో అమలాపాల్ కొన్నాళ్లు సన్నిహితంగా గడిపింది. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ ఏమైందో తెలీదు... సడన్ గా విజయ్ లైన్‌లోకి రావడం, వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవడం జరిగిపోయాయి. ఆ తరవాత విడిపోయారనుకోండి.. అది వేరే విషయం. అయితే ఇప్పుడు సడన్ గా మాజీ ప్రియుడు మళ్లీ ఎంటర్ అయ్యాడు.
అమలాపాల్ ని వేధింపులకు గురి చేస్తున్నాడు. వాళ్లిద్దరూ సన్నిహితంగా ఉంటున్న వీడియోలు బయటపెడతానని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. దాంతో విసిగిపోయిన అమలాపాల్ పోలీసుల్ని ఆశ్రయించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేయడం ప్రారంభించారు. పవీందర్ ని అరెస్టు చేయడమే కాకుండా.. మరో 11మంది కోసం కూడా గాలింపులు చేపట్టారు.