డాక్టర్‌ని పెళ్లాడిన అమలాపాల్‌ మాజీ భర్త!

మరిన్ని వార్తలు

యాక్టర్‌ చేజారింది. డాక్టర్‌ దక్కింది తమిళ డైరెక్టర్‌ ఎ.ఎల్‌.విజయ్‌కి. అదేనండీ అమలాపాల్‌ మాజీ భర్త విజయ్‌కి. యాక్టర్‌ అయిన అమలాపాల్‌ని 2014లో లవ్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు విజయ్‌. మూడేళ్ల వైవాహిక జీవితం తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఆ బంధాన్ని విడాకులతో రద్దు చేసుకున్నారు. 2017లో అమలాపాల్‌తో వివాహ బంధాన్ని రద్దు చేసుకున్నాక విజయ్‌ తాజాగా రెండో వివాహం చేసుకున్నారు.

 

పెద్దల సమక్షంలో గురువారం ఆయన వివాహం ఘనంగా జరిగింది. డాక్టర్‌ ఐశ్వర్యను విజయ్‌ వివాహమాడారు. అమలాపాల్‌ని లవ్‌ చేసి పెళ్లి చేసుకున్న విజయ్‌, ఇతర కారణాలతో ఆమెతో వివాహ బంధాన్ని రద్దు చేసుకోవల్సి వచ్చింది. ఆ తర్వాత అమలాపాల్‌ సినిమాలతో బిజీ అయిపోయింది. ఆమెకు ఇప్పట్లో వివాహం చేసుకునే ఆలోచన ఉన్నట్లు తెలీదు కానీ, విజయ్‌ జూన్‌ 29న ఐశ్వర్యతో వివాహం గురించి అభిమానులకు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు.

 

గురువారం ఆయన వివాహం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. పెద్దలు కుదిర్చిన వివాహమిది. జంట భలేగుందని, హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌ విషెస్‌ని పోస్ట్‌ చేస్తున్నారు విజయ్‌ ఫ్యాన్స్‌. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన 'అభినేత్రి 2' విజయ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS