'ఆమె' సినిమాతో సంచలనం సృష్టించిన అమలాపాల్ ఇప్పుడు చాలా చాలా బిజీగా గడుపుతోంది. తెలుగులో 'లస్ట్ స్టోరీస్' అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. నందినీ రెడ్డి డైరెక్షన్లో ఇటీవలే ఈ వెబ్ సిరీస్ నిర్మాణం పూర్తయ్యింది. హిందీలో ఓ చిత్రంలో నటిస్తోంది. తమిళంలో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌తో బిజీగా గడుపుతోంది. తెలుగులోనూ మంచి అవకాశం కోసం ఎదురు చూస్తోంది. ఇక తాజాగా బీచ్ ఒడ్డున ఓ డిఫరెంట్ హాట్ ఫోటో సెషన్ చేయించుకుంది. నిజంగానే డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తోంది.
బేబీ పింక్ కలర్ డ్రస్ ధరించింది. రన్నింగ్ ప్లెయిన్ ప్యాటర్న్‌లో ఉన్న ప్యాంట్ అండ్ స్లీవ్‌లెస్ టాప్. ఓల్డ్ ప్యాటర్న్ అయినా, టాప్‌కి కొంచెం న్యూ లుక్ అద్దింది. ఫ్రంట్ డీప్ నెక్ వదిలేసి కింద ముడి పెట్టేసింది. ఓ సెన్సువల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి, బీచ్ ఒడ్డున ఓ బండరాయికి అనుకుని నిలబడింది. హెయిర్‌ని టైట్ ప్యాక్ చేయడంతో డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తోంది. బ్యాక్ గ్రౌండ్లో ఎగిసి పడుతున్న అలలు అమలాపాల్ అందాల్ని తాకేందుకు ఉర్రూతలూగుతున్నట్లు బిల్డప్ ఇస్తున్నాయి.