బాలీవుడ్‌లో వంద కోట్ల క్లబ్‌లో చేరిన హీరోయిన్లు ఎందరో ఉన్నారు. కొన్ని సినిమాలు సాధించే వంద కోట్ల పైన వసూళ్ళ ప్రకారం అందులో నటించిన హీరోయిన్లకీ ఆ క్రెడిట్ ఇవ్వడం బాలీవుడ్‌లోనే చూస్తుంటాం. తెలుగులో అది కొంచెం తక్కువే. 'అరుంధతి' సినిమా తర్వాత అనుష్కకి అంతటి ఫాలోయింగ్ వచ్చింది. కేవలం అనుష్క మీదనే 50 కోట్లు బడ్జెట్ పెట్టేందుకే ఇక్కడ వెనుకాడలేదు. అలా 50 కోట్ల బడ్జెట్ ఓ హీరోయిన్ మీద వెచ్చించి తీసిన సినిమాల్లో 'రుద్రమదేవి' సినిమా ఒకటి. ఇదిలా ఉండగా కన్నడలో అమలాపాల్ నటించిన సినిమా ఒకటి 100 కోట్ల క్లబ్‌లో చేరింది. అందులో 'కిచ్చా' సుదీప్ హీరోగా నటించాడు. 'ఈగ' సినిమాలో విలనే ఈ సుదీప్. 'ఈగ' సినిమాతో సుదీప్‌కి తెలుగులోనూ మంచి పేరు వచ్చిందనుకోండి. అయితే కన్నడలో సుదీప్ పాపులర్ హీరో. ఈయన తాజా సినిమా పేరు 'హెబ్బులి'. ఈ సినిమా ఘనవిజయంతో అమలాపాల్ కన్నడలో స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగులో ఈమె 'నాయక్' సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఇది సక్సెస్‌ఫుల్ మూవీనే అయినా కానీ సక్సెస్ క్రెడిట్ మాత్రం మరో హీరోయిన్ కాజల్‌కి వెళ్ళిపోయింది. ఏదేమైనా అమలాపాల్ 100 కోట్ల క్లబ్‌లోకి చేరిందని కన్నడ మీడియా కోడై కూస్తుండడం హీరోయిన్‌గా ఆమెకు చాలా గౌరవం ఇచ్చినట్లే భావించాలి. మొత్తానికి సెకండ్ ఇన్నింగ్స్‌లో అమలాపాల్ పేరు ఏ రకంగానైనా సరే..మార్మోగిపోతోంది.