ఆసుపత్రిలో అమలాపాల్‌ అసలేమైందంటే.!

మరిన్ని వార్తలు

అందాల భామ అమలాపాల్‌ హాస్పిటల్‌లో అడ్మిట్‌ అయ్యింది. షూటింగ్‌లో గాయపడిన ఆమె చేతికి గాయమైంది. చిన్న గాయమే కదా అనుకుని పెయిన్‌ కిల్లర్స్‌తో సరిపెడదామనుకుందట. అయితే కాస్పేపటికే భరించలేని పెయిన్‌ రావడంతో అర్జెంటుగా హాస్పిటల్‌లో జాయిన్‌ అయ్యిందట. 

చేతికి కట్టుతో హాస్పిటల్‌ బెడ్‌పై ఉన్న ఫోటోని అమలాపాల్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఆ ఫోటో చూసి ఆమె ఫ్యాన్స్‌ ఆందోళన చెందారు. వివరం తెలిశాక కాస్త కుదుట పడ్డారు. తెలుగులో అమలాపాల్‌ 'బెజవాడ', నాయక్‌' చిత్రాలతో సుపరిచితురాలు. కన్నడ, తమిళ, మలయాళ చిత్రాలతో ప్రస్తుతం బిజీగా ఉంది. చేతికి గాయం కారణంగా అమలాపాల్‌ షూటింగ్‌ నుండి కాస్త విరామం తీసుకుందట. గాయం ఓ కొలిక్కి రాగానే షూటింగ్‌కి అటెండ్‌ అవుతానని చెబుతోంది. అదీ సంగతి. 

ఇకపోతే ఈ మధ్య ఏదైనా పబ్లిసిటీనే. కష్టం, సుఖం అన్నీ సోషల్‌ మీడియాలోనే పంచుకుంటున్నారు. అస్సలేమీ దాచుకోవడం లేదు. అందమైనా, కష్టమైనా.. ఇంకేదైనా. అన్నింటికీ వర్తించేస్తోందది. ఏది ఏమైనా ఏ ఎమోషన్‌ అయినా కానీ ఇమీడియట్‌గా జనంలోకి వెళ్లిపోతోందంతే. ఆ లెక్కల్లోనే వెరీ లేటెస్టుగా అమలాపాల్‌ పోస్ట్‌ చేసిన ఈ హాస్పిటల్‌ సెల్ఫీ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS