సెన్సేషనల్‌ స్టార్‌తో అందాల 'రాశి' నిజమేనా.?

By iQlikMovies - August 14, 2018 - 17:40 PM IST

మరిన్ని వార్తలు

టాలీవుడ్‌ సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండతో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ చేసేందుకు అమ్మాయిలు అంటే ముద్దుగుమ్మలు ఎంత ఉబలాటపడుతున్నారో తెలుసా? ఏకంగా స్టార్‌ హీరోయిన్లు కూడా క్యూ కట్టేస్తున్నారట. అవును మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజమంటండీ. 

ఎందుకంటే, సినిమాలో కంటెన్ట్‌ ఉన్నా లేకున్నా, ఈ హీరోగారి సినిమాలకు ఏ రేంజ్‌లో క్రేజ్‌ వచ్చేస్తోందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటప్పుడు మనోడి సరసన నటిస్తే, ఆటోమెటిగ్గా హీరోయిన్స్‌కి కూడా క్రేజ్‌ రావడం గ్యారంటీ. అంతెందుకు మనోడితో సినిమాలు తీసేందుకు ప్రముఖ దర్శకులు, నిర్మాతలు కూడా లైన్‌లో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఆల్రెడీ అభయమిచ్చేశారు. విజయ్‌తో వంద సినిమాలు తెరకెక్కించేయొచ్చునని. ఇది అభయమనాలో, మునగచెట్టు ఎక్కించడమనాలో తెలీదు కానీ, ఆయన అరత మాటన్నాక, విజయ్‌తో ఒకటేంటి రెండు మూడు సినిమాలు ఆయన సొంత బ్యానర్‌లో నిర్మించాల్సిందే. 

ఇకపోతే ఎంత చేసినా క్రేజ్‌ సంపాదించలేని హీరోయిన్లు కూడా విజయ్‌తో ఒక్కసారి నటించాలనుకుంటున్నారట. ఆ వరసలో ముందున్నది ముద్దుగుమ్మ రాశీఖన్నాట. పాపం ఈ ముద్దుగుమ్మకి హిట్‌ వచ్చినా కానీ పెద్దగా పట్టించుకోవడం లేదెవ్వరూ. 'తొలిప్రేమ' సినిమాతో ఏకంగా మెగా కాంపౌండ్‌ హీరోతో హిట్‌ కొట్టింది. కానీ నితిన్‌తో చేసిన 'శ్రీనివాస కళ్యాణం' బాగా నిరాశపరిచేసింది. దాంతో ఈ ముద్దుగుమ్మ మదిలో మెదులుతున్న తర్వాతి హీరో విజయ్‌ దేవరకొండ అని గుసగుసలు వినిపిస్తున్నాయండోయ్‌. 

విజయ్‌ నటించిన 'గీత గోవిందం' చిత్రం ఆగష్టు 15కు ప్రేక్షకుల ముందుకు రానుంది. 'డియర్‌ కామ్రేడ్‌', 'నోటా' చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో కె.ఎస్‌రామారావు బ్యానర్‌లో విజయ్‌ మరో సినిమాకి కమిట్‌ అయ్యాడు. ఒకవేళ ఈ సినిమాకే ,క్రేజ్‌ తెచ్చుకోవాలన్న రాశీఖన్నా కోరిక తీరేనేమో.!

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS