సినిమా స్టార్లు ముదిరితే రాజకీయనాయకులవుతుంటారు. తెచ్చుకున్న పలుకుబడిని, సంపాదించుకున్న అభిమానుల్నీ రాజకీయాల్లో ఉపయోగించుకుంటూ... నేతలుగా చలామణీ అవుతుంటారు. అటు రాజకీయ పార్టీలకూ సినీ గ్లామర్ అవసరమే. అందుకే... సినిమా - రాజకీయం అనే కాంబినేషన్ సక్సెస్ ఫుల్ గా సాగిపోతోంది. ప్రస్తుతం దేశమంతా 2019 ఎన్నికల వేడి రాజుకుంటోంది. దానికి తోడు సినిమావాళ్లు కూడా రాజకీయాలపై దృష్టి పెడుతున్నారు. ఈ లిస్టులో అల్లు అర్జున్ హీరోయిన్ అమలాపాల్ కూడా ఉంది. అమలాపాల్ ఫోకస్ ఇప్పుడు రాజకీయాలపై పడింది. తరచూ కొన్ని హాట్ హాట్ టాపిక్కులతో ట్వీట్టర్ మోత మోగిస్తున్న అమలాపాల్ కు ఓ రాజకీయ పార్టీ టికెట్ ఆఫర్ చేసినట్టు వార్తలొస్తున్నాయి.
అమలాపాల్ కూడా అభిమానులు కోరితే తప్పకుండా రాజకీయాల్లోకి వస్తా అంటూ ఓ స్టేట్‌మెంట్ విసిరేసింది. ఏదైనా కాలమే నిర్ణయిస్తుందని, రాజకీయాల్లోకి వెళ్లే అవసరం, పరిస్థితులు ఏర్పడితే ఎవ్వరూ కాదనలేరని అంటోంది అమల. రాజకీయాల్లోకి రావడం ఖాయమని, అయితే పార్టీ ఏదన్నది ఇంకా నిర్ణయించుకోలేదని, దానికి ఇంకా సమయం ఉందని తేల్చేసింది.
ప్రజా సేవకు రాజకీయాల్లో చేరాల్సిన అవసరం లేదంటూనే `రాజకీయాల్లోకి రావడం పక్కా` అని స్టేట్‌మెంట్ ఇవ్వడం చూస్తుంటే - త్వరలో అమలాపాల్ జేతిలో రాజకీయా పార్టీ జెండా ఉండడం ఖాయంలా కనిపిస్తోంది. సినిమాల్లో ఓ మాదిరి సక్సెస్ అయిన ఈ భామ.. పోలిటిక్స్‌లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో మరి.