రామ్ చరణ్ - బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ దసరా పండగకి రామ్ చరణ్ కొత్త సినిమాకి సంబంధించిన విశేషాలు తెలుస్తాయని మెగా అభిమానులు ఆశగా ఎదురుచూశారు. కానీ చిత్రబృందం ఎలాంటి హడావుడీ లేకుండా గప్ చుప్‌గా ఉండిపోయింది. ఈచిత్రం కోసం 'వినయ విధేయ రామ' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నాడు. దసరా రోజున ఈ టైటిల్‌ని అధికారికంగా ప్రకటిస్తారని అభిమానులు భావించారు.
ఇప్పటి వరకూ ఫస్ట్ లుక్ విడుదల చేయకపోవడంతో... దసరా రోజున అదికూడా చూడొచ్చని ఆశించారు. కానీ చిత్రబృందం నుంచి ఎలాంటి అలికిడీ లేదు. దాంతో మెగా ఫ్యాన్స్ నిరాశ పడ్డారు. మరోవైపు చిరంజీవి 151వ చిత్రం 'సైరా'కి సంబంధించిన లుక్ అయినా వస్తుందని భావించారంతా. ఆ ఊసూ లేకుండా పోయింది.
ఈ దసరాకి లుక్కులు, టీజర్ల హడావుడి ఎక్కువగానే కనిపించింది. ఈ గుంపుతో కాకుండా సెపరేట్‌గా రావాలని చరణ్ భావించి ఉంటాడు. అందుకే లుక్కులు లేటవుతున్నాయేమో..?