టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాజిలర్... ప్రభాస్. ఈ బాహుబలి పెళ్లెప్పుడు?? అంటూ ప్రభాస్ అభిమానులే కాదు, యావత్ చిత్రసీమ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
ఓ కథానాయికతో ప్రభాస్ ప్రేమలో ఉన్నాడని, తననే పెళ్లి చేసుకోబోతున్నాడనే గుసగుసలూ వినిపించాయి. `ఈ యేడాది ఎలాగైనా సరే పెళ్లి చేసేస్తాం` అని కృష్ణంరాజు కూడా రెండు మూడేళ్లుగా చెబుతూనే ఉన్నారు. ఎట్టకేలకు అందుకు మూహూర్తం కుదిరిందని తెలుస్తోంది. అతి త్వరలో ప్రభాస్ పెళ్లి కబురు వినిపించబోతోందట. ఓ బిజినెస్ మేన్ కుమార్తెతో ప్రభాస్ పెళ్లి నిశ్చయమైందని టాక్.
ఈ విషయాన్ని స్వయంగా ప్రభాసే అభిమానులకు చెబుతారని తెలుస్తోంది. ఈనెల 23న ప్రభాస్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ తీపి వార్తని అభిమానులతో పంచుకునే అవకాశం ఉందని ఇండ్రస్ట్రీ వర్గాలు ఊహిస్తున్నాయి. ఇదే నిజమైతే.. దీనికంటే పుట్టిన రోజు కానుక అభిమానులకు ఏముంటుంది??
ప్రస్తుతం సాహోలో నటిస్తున్నాడు ప్రభాస్. సగం చిత్రీకరణ పూర్తయింది. మరోవైపు రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు. దీనికి `జాన్` అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. పెళ్లి కబురు ఎప్పుడు వినిపించినా.. 2019 ప్రధమార్థంలో పెళ్లి జరిగే అవకాశం ఉందని టాక్.