అందాల భామ అమలాపాల్ కెరీర్ మొదట్లోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్‌తో పాటు, ప్రాధాన్యత ఉన్న పాత్రల్నీ పోషించింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విజయవంతమైన చిత్రాలతో మోస్ట్ పాపులర్ అయ్యిందీ ముద్దుగుమ్మ.
పెళ్లి కెరీర్‌కి అడ్డంకిగా మారడంతో, ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తతో విడాకులు తీసుకుని వార్తల్లోకెక్కింది. వార్తల్లోకి ఎక్కితే ఎక్కింది కానీ, మ్యారేజ్ బ్రేక్‌అప్ తర్వాత కెరీర్‌లో రాకెట్ స్పీడుతో దూసుకెళ్లిపోతోంది. తెలుగులో చేయట్లేదు కానీ, తమిళ, మలయాళంలో వరుస చిత్రాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. తమిళంలో అమలాపాల్ నటించిన 'బాస్కర్ ఒరు రాస్కెల్' చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. హ్యాండ్‌సమ్ హీరో అరవింద్‌స్వామి ఈ సినిమాలో అమలాతో జత కడుతున్నాడు.
కాగా తెలుగులో ఈ బ్యూటీ మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌తో 'నాయక్' చిత్రంలో నటించింది. కాస్త తీరిక దొరికితే ఇదిగో ఇలా స్పెషల్ అండ్ డిఫరెంట్ కాస్ట్యూమ్‌తో సోషల్ మీడియాలో మెరిసిపోతుంది. ఈ ఎల్లో అండ్ ఆరెంజ్ పేటర్న్ కాస్ట్యూమ్‌లో అమలాపాల్ గ్లామర్‌లో సింప్లీ సూపర్బ్ అనిపిస్తోంది కదా.