అరవిరిసిన గులాబీ అందం అంటే ఇదేనేమో అనిపించక మానదు. ఇంతకీ ఈ గులాబి అందాలొలికే ముద్దుగుమ్మ ఎవరనుకుంటున్నారా? దీపికా పదుకొనె. కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో దీపికా పదుకొనె ఇలా పింక్ కలర్ అందమైన లాంగెస్ట్ గౌనులో మెరిసిపోయింది. రెడ్ కార్పెట్ కాస్తా, దీపికా అందమైన గులాబీ వర్ణపు గౌనుతో పింక్ కార్పెట్‌లా మారిపోయింది. దీపిక అందం ఓ ఎత్తు, ఆమె ధరించిన ఆ కాస్ట్యూమ్ అందం మరో ఎత్తు అన్నట్లుగా పోటీ పడ్డాయి. పింక్ కలర్ ఫ్రాక్‌కి క్వైట్ కాంట్రాస్ట్ ఇయర్ రింగ్స్‌తో డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కెమెరాలకే కన్ను కుట్టే అందంతో ధగ ధగ మెరిసిపోయింది. గ్లామర్ ఒలకబోయడం దీపికాకి కొత్తేమీ కాకపోయినా, కేన్స్‌లో ఈ తరహా కాస్ట్యూమ్‌లో హొయలొలికించడం అంటే అది ఖచ్చితంగా స్పెషలే మరి.