ఈమధ్య అమలాపాల్ రెండో పెళ్లి వార్త తెగ చక్కర్లు కొట్టింది. తన ప్రియుడు భవీందర్ సింగ్‌ని అమలాపాల్ పెళ్లి చేసుకుందని అందుకు సంబంధించిన ఫొటోలతో ఓ వార్త హల్ చల్ చేసింది. అమలాపాల్, భవీందర్ పెళ్లి దుస్తుల్లో ఉండడం, కెమెరాల సాక్షిగా వారిద్దరూ లిప్‌లాక్‌లు పెట్టుకోవడంతో అమలాపాల్ పెళ్లి అయిపోయిందన్న విషయాన్ని జనాలూ నమ్మేశారు. ఇంత గప్ చుప్‌గా, ఎవ్వరికీ తెలియకుండా, ముందస్తు సమాచారమేదీ అభిమానులకు ఇవ్వకుండా పెళ్లి చేసుకుందేమిటి? అని అంతా ఆశ్చర్యపోయారు.
అయితే ఇప్పుడు తీరిగ్గా ఈ పెళ్లి విషయంపై స్పందించింది అమలాపాల్. తాను ఎవ్వరినీ పెళ్లి చేసుకోలేదని, ఆ ఫొటోలు ఓ ఫొటోషూట్‌లో భాగంగా తీయించుకున్నవని క్లారిటీ ఇచ్చింది. దర్శకుడు విజయ్‌ని అమలాపాల్ పెళ్లి చేసుకోవడం, ఆ తరవాత ఇద్దరూ విడాకులు తీసుకోవడం, అప్పటి నుంచీ భవీందర్ సింగ్‌తో పాల్ ప్రేమాయాణం నడపడం తెలిసిన విషయాలే. అందుకే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారనగానే జనాలూ నమ్మేశారు. ఇప్పుడు ఇదంతా ఉత్తుత్తిదే అని తేలిపోయింది. పెళ్లి ఫొటోలు నిజం కాదు గానీ, ఆ లిప్పులాకులు మాత్రం నిజమే కదా. మరి వాటి మాటేమిటో?