అమలా పాల్‌ పెళ్ళంట.. ఈసారైనా నిజమయ్యేనా?

మరిన్ని వార్తలు

డస్కీ బ్యూటీ అమలా పాల్‌ పెళ్ళంట.! కొన్నాళ్ళ క్రితం ఓ గాసిప్‌ రావడమే కాదు, దానికి సంబంధించి కొన్ని పొటోలు కూడా వెలుగు చూశాయి. అంతకు ముందు సోషల్‌ మీడియాలో అమలా పాల్‌ తన ప్రియుడితో వున్న ఫొటోల్ని షేర్‌ చేయడం, ఆయనే ఆ పెళ్ళి ఫొటోల్లో కన్పించడంతో అంతా షాకయ్యారు. చివరికి అదంతా ఓ ప్రకటనకు సంబంధించిన ఫొటోలని తేలాయి. తూచ్‌, అదంతా ఉత్తదేనని అమలాపాల్‌ కొట్టి పారేసింది. ఎవరితోనైనా స్నేహం తప్ప, తాను ప్రస్తుతానికి ఎవర్నీ ప్రేమించడంలేదని తేల్చేసింది.

 

ఆ సంగతి పక్కన పెడితే, తాజాగా అమలా పాల్‌ పెళ్ళంటూ కొత్త గాసిప్స్‌ షురూ అయ్యాయి. అతి త్వరలోనే ఈ పెళ్ళి జరగబోతోందట. అదెలా.? లాక్‌డౌన్‌ అమల్లో వుంది కదా.! అంటే, ప్రత్యేకంగా పర్మిషన్స్‌ తీసుకుని మరీ అమలా పాల్‌ పెళ్ళి చేసుకోబోతోందని అంటున్నారు. ఇంతకీ వరుడెవరో! ఈ ప్రశ్నకి మాత్రం సమాధానం దొరకడంలేదు. గతంలో గాసిప్స్‌లో విన్పించిన వ్యక్తే బహుశా అమలాపాల్‌కి కాబోయే భర్త అనే ప్రచారం జురుగుతోంది. అమలా పాల్‌ మాత్రం ప్రస్తుతానికి ఈ విషయంలోనూ మౌనం దాల్చుతోంది. అమలా పాల్‌ గతంలో ఓ దర్శకుడ్ని పెళ్ళాడటం, ఆ పెళ్ళి తక్కువ రోజుల్లోనే ఇద్దరూ విడిపోవడం తెలిసిన విషయాలే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS