'ఆమె' నిర్మాణంలో తెలుగు సినిమా?

మరిన్ని వార్తలు

హీరోయిన్స్‌గా రాణిస్తూనే మరోవైపు నిర్మాతలుగా కూడా తమ అభిరుచిని చాటుకుంటున్నారు అందాల భామలు. ఆ లిస్టులో తమిళ డస్కీ బ్యూటీ అమలాపాల్‌ ఎప్పుడో ఎంట్రీ ఇచ్చేసింది. ఆల్రెడీ తమిళంలో ఆమె నిర్మాణంలో ఓ సినిమా షూటింగ్‌ జరుపుకుంటోంది. తెలుగులోనూ తన నిర్మాణ పనితనాన్ని చూపించాలనుకుంటోందట. త్వరలోనే అమలాపాల్‌ నిర్మాణంలో ఓ సినిమాకి రంగం సిద్ధమవుతోందట. ఓ కొత్త డైరెక్టర్‌ ఈ సినిమాతో పరిచయం కానున్నాడట. ఇటీవల అమలాపాల్‌, 'ఆమె' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.

 

ఈ సినిమాలో ఆమె న్యూడ్‌ షో సెన్సేషన్‌ కావడంతో, విడులకు ముందు విపరీతమైన హైప్‌ క్రియేట్‌ అయ్యింది. కానీ, విడుదలయ్యాక ఆ హైప్‌ని అందుకోలేకపోయింది 'ఆమె'. అయినా ఈ సినిమాతో అమలాపాల్‌ ఓ కొత్త సెన్సేషనే క్రియేట్‌ చేసింది. దాంతో ఆ క్రేజ్‌ని క్యాష్‌ చేసుకోవాలనే ఇక్కడ కూడా నిర్మాతగా తన సత్తా చాటాలనుకుంటోందట.

 

అయితే, ఈ సినిమాలో అమలాపాల్‌ నటిస్తుందా.? లేక తెలుగు నటీనటులెవరైనా నటిస్తారా.? అనే కన్‌ఫ్యూజన్‌ ఉంది. కానీ, అమలాపాల్‌ నటిస్తూ, ఈ సినిమా నిర్మించనుందనీ ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ ద్వారా అందుతోన్న సమాచారం. తెలుగులో ప్రముఖ యంగ్‌ హీరో ఈ సినిమాలో నటించనున్నాడనీ ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. గతంలో అమలాపాల్‌ చరణ్‌తో 'నాయక్‌' సినిమాలోనూ, నాగచైతన్యతో 'బెజవాడ' చిత్రంలోనూ నటించిన సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS