హిలేరియస్‌ యాక్షన్‌ ప్యాక్‌డ్‌ 'జాక్‌పాట్‌'.!

మరిన్ని వార్తలు

'చంద్రముఖి' అంటే జ్యోతిక, జ్యోతిక అంటే 'చంద్రముఖి' అన్నంతలా ఆ పాత్ర అందరికీ దగ్గరైంది. అంతకు ముందే జ్యోతిక తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. చిరంజీవితో 'ఠాగూర్‌', నాగార్జునతో 'మాస్‌', రవితేజతో 'షాక్‌' వంటి తెలుగు సినిమాలు జ్యోతిక కెరీర్‌లో సూపర్‌ హిట్స్‌గా నిలిచాయి. సినిమాల్లో రైజింగ్‌గా ఉన్నప్పుడే తమిళ హీరో సూర్యను వివాహమాడి, ఇద్దరు పిల్లలకు తల్లి అనిపించుకున్నాక, మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది.

 

రీ ఎంట్రీలో చాలా బిజీ అయిపోయింది జ్యోతిక. వరుస సినిమాలతో ఆకట్టుకుంటోంది. తాజాగా జ్యోతిక నటించిన 'జాక్‌పాట్‌' చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ని లేటెస్ట్‌గా రిలీజ్‌ చేశారు. ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. మెగా మేనల్లుడు సాయి ధరమ్‌తేజ్‌ ఈ ట్రైలర్‌ చాలా బాగుందని, జ్యోతికపై ప్రశంసలు కురిపించారు. తనకెంతో ఇష్టమైన కపుల్స్‌ సూర్య - జ్యోతిక అని తెలిపారు. భర్త సూర్య నిర్మాణంలో కళ్యాణ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సీనియర్‌ నటి రేవతి కీలక పాత్రలో నటిస్తోంది.

 

ట్రైలర్‌ విషయానికి వస్తే, జ్యోతిక, రేవతి రకరకాల గెటప్స్‌ వేస్తూ, అవినీతి పరుల వద్ద నుండి డబ్బు దొంగిలించి పేద పిల్లలకు పెడుతుంటారు. అందుకోసం విలన్స్‌తో జ్యోతిక చేసే యాక్షన్‌ సీన్స్‌ కొన్ని సీరియస్‌గానూ, ఇంకొన్ని కామెడీగా నవ్వు తెప్పించేలానూ ఉన్నాయి. మొత్తానికి యాక్షన్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న 'జాక్‌పాట్‌' ట్రైలర్‌కి పోజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. రిలీజ్‌ టైమింగ్‌ సెట్‌ అయితే, సినిమాకి హిట్‌ కళ కూడా కనిపిస్తోంది. ఆగస్ట్‌లో ఈ హిలేరియస్‌ కామెడీ యాక్షన్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా చిత్రయూనిట్‌ ప్లాన్‌ చేస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS