అమ్మ చెప్పింది. అందుకే ఆ సీన్‌లో నటించా - అమలాపాల్‌.

మరిన్ని వార్తలు

అమలాపాల్‌ తాజా చిత్రం 'ఆమె' ఎంతగా హాట్‌ టాపిక్‌ అయ్యిందో తెలిసిన సంగతే. అందుకు కారణం ప్రచార చిత్రాల్లో ఆమె న్యూడ్‌ షో చేయడమే. ఈ సీన్‌ కోసం అమలాపాల్‌ని ప్రశంసించిన వారూ ఉన్నారు. వ్యతిరేకిస్తున్న వారూ వున్నారు. అయితే, ఈ సీన్‌ విషయంలో ఈ అమ్మగారి అభిప్రాయమేంటని ప్రశ్నించగా, అమలాపాల్‌ అందుకు వివరణ ఇచ్చింది.

 

'సినిమాకి సైన్‌ చేసే ముందే ఈ సీన్‌ గురించి చెప్పారు. అదే విషయం అమ్మతో కూడా చెప్పాను. కథకి అవసరం అనుకుంటే, నటించు తప్పులేదని అమ్మ చెప్పాకనే ఈ సినిమాకి సైన్‌ చేశా..' అని అమలాపాల్‌ చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే, ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్‌ అన్నీ హాట్‌ హాట్‌గానే జరుగుతున్నాయి. దాంతో ఇదేదో అడల్ట్‌ మూవీ లెక్కల్లోకి వెళ్లిపోతుందేమో అని భయపడినట్లుంది అమలాపాల్‌. ఇది శృంగార నేపథ్యమున్న చిత్రం కానేకాదు. నేటి సమాజానికి మంచి మెసేజ్‌ ఇచ్చే సినిమా 'ఆమె'. ప్రచార చిత్రాలను చూసి సినిమాని అవైడ్‌ చేయకండి. ఖచ్చితంగా సినిమా చూడండి.

 

చూసినాక తెలుస్తుంది.. ఈ స్థాయిలో సినిమాని ఎందుకు ప్రచారం చేశారా.? అని అమలాపాల్‌ అంటోంది. అంతేగా, ఏదో ఒక కాంట్రవర్సీ సబ్జెక్ట్‌ని ఎంచుకుని ప్రమోట్‌ చేస్తే తప్ప ధియేటర్స్‌కి జనాన్ని ఆకర్షించలేకపోతున్న రోజులివి. మెసేజ్‌ ఓరియెంటెడ్‌ సినిమా అంటే ఇక అస్సలు అటు వైపు చూడడం లేదు. దాంతో 'ఆమె' సినిమాని అలా ప్రమోట్‌ చేయడం జరుగుతోంది. కానీ, సినిమా మాత్రం అందరూ ఖచ్చితంగా చూడదగ్గది. అందరికీ నచ్చుతుంది. అప్పుడు నిజమైన ప్రశంసలు నాకు దక్కుతాయి.. అని కాన్ఫిడెంట్‌గా చెబుతోంది అమలాపాల్‌. ఈ శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS