నెంబర్‌ సీక్రెట్‌ రివీల్‌ చేసిన 'గుణ'వంతుడు!

మరిన్ని వార్తలు

కార్తికేయ హీరోగా 'గుణ 369' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కండలతో బ్యాక్‌ యాంగిల్‌ని చూపిస్తూ, ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. తర్వాత పంచెకట్టులో కూల్‌ కూల్‌గా గుణవంతుడిలా హీరో లుక్‌ లాంఛ్‌ చేశారు. ఆ తర్వాత వచ్చిన టీజర్‌లో లవర్‌ బోయ్‌లా చూపించారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌ విషయానికొస్తే, కథని అటూ ఇటూగా కొంచెం డీటెయిల్డ్‌గానే రివీల్‌ చేసినట్లుంది.

 

మొదట లవర్‌ బోయ్‌గా చూపించారు. 'మన వాళ్లంతా సంతోషంగా ఉండాలంటే, ప్రపంచంలోని ప్రమాదాలు ఏ రూపంలో వస్తాయో ముందే చెప్పాలిరా..' అంటూ ట్రైలర్‌ స్టార్ట్‌ అయ్యింది. లవ్‌, రొమాన్స్‌ కామెడీ, యాక్షన్‌ అన్నీ సమపాళ్లలో మిక్స్‌ చేసి ట్రైలర్‌ కట్‌ చేశారు. కమర్షియల్‌గా వర్కవుట్‌ అయ్యే ఏ అంశాన్నీ వదిలిపెట్టలేదు. యూత్‌కి కావల్సిన లిప్‌లాక్‌ కూడా సన్నగా షాడోలో లాగించేశారు. హీరోయిన్‌ అనఘ ఈ సినిమాలో సెల్‌ఫోన్‌ కంపెనీలో పని చేసే యువతిగా కనిపిస్తోంది. కార్తికేయ తన నేచురల్‌ యాక్టింగ్‌తో ట్రైలర్‌కి వెయిట్‌ తీసుకొచ్చాడు. బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఆకట్టుకుంటోంది.

 

బోయపాటి శిష్యుడు అర్జున్‌ జంథ్యాల యాక్షన్‌ సీన్స్‌లో అక్కడక్కడా గురువుగారి మార్క్‌ని గుర్తు చేస్తున్నాడు. చివరిగా మన హీరోని ఓ ఖైదీగా చూపించారు. ఆ ఖైదీ నెంబరే '369'. అదీ అసలు సంగతి. ఇంతవరకూ ఆ నెంబర్‌ సంగతేంటా.? అని క్యూరియాసిటీతో ఎదురు చూసిన ఆడియన్స్‌ సస్పెన్స్‌కి ట్రైలర్‌తో తెర దించేశారు. మొత్తానికి ట్రైలర్‌ మంచి రెస్పాన్సే అందుకుంటోంది. ఇటీవల 'హిప్పీ'తో నిరాశపరిచిన కార్తికేయకు మూడో సినిమాగా వస్తున్న 'గుణ 369' ఎలాంటి రిజల్ట్‌ ఇస్తుందో చూడాలి. ఆగస్ట్‌ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS