లిప్‌లాక్‌కి నో చెప్పిన బికినీ బొద్దుగుమ్మ!

మరిన్ని వార్తలు

తొలి సినిమా అయినా, ఇప్పుడు ముద్దుగుమ్మలకు లిప్‌లాక్స్‌ తప్పనిసరి అయిపోతున్నాయి. ఇదివరకట్లో కెమెరా ట్రిక్స్‌ ప్లే చేసేశారు ముద్దు సీన్లలో. కానీ, ఇప్పుడు లైవ్‌గా ముద్దులు పెట్టేసుకుంటున్నారు. విచ్చలవిడిగా లిప్‌లాక్‌ సీన్లలో నటించేస్తున్నారు. అసలు లిప్‌లాక్‌ లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదేమో ఈ జనరేషన్‌ మూవీస్‌కి. అలాంటిది లిప్‌లాక్‌కి నో చెప్పిన ఈ భామ ముచ్చట విన్నారా? ఇంతకీ ఎవరా ముద్దుగుమ్మ అని ఆశ్చర్యపోతున్నారా? 'కొమరం పులి' సినిమాలో పవన్‌ కళ్యాణ్‌కి జంటగా నటించిన ముద్దుగుమ్మ నికీషా పటేల్‌.

 

తెలుగులో తొలి సినిమాతోనే నిరాశపరచడంతో పెద్దగా పట్టించుకోలేదీ భామని. కానీ, తమిళంలో బాగానే సినిమాలు చేసింది. ఇంకా చేస్తోంది కూడా. సినిమాలతో కన్నా, ఈ పాప బికినీలతోనే ఎక్కువ ఫేమస్‌. బొద్దుగా ఉండే నికీషా పటేల్‌ కష్టపడి వర్కవుట్స్‌ చేసి, సన్నగా స్లిమ్‌ ఫిట్‌గా మారిపోయింది. ఎప్పటికప్పుడే స్విమ్‌ సూట్స్‌లో, బికినీస్‌లో కనిపించి ఆ మధ్య సోషల్‌ మీడియాని హీటెక్కించేసింది.

 

తాజాగా తమిళంలో ఓ సినిమా కోసం నికీషా పటేల్‌ లిప్‌లాక్‌ సీన్‌ని వ్యతిరేకించిందట. అయితే, దర్శకుడు ఆ సీన్‌ ప్రాధాన్యత గురించి వివరించి చెప్పగా, కథ డిమాండ్‌ చేయడంతో ఆ సీన్‌లో నటించేందుకు ఒప్పుకుందట. ఆ సీన్‌ అవుట్‌ పుట్‌ చాలా బాగా వచ్చిందనీ చెబుతోంది. ఈ విషయాలన్నీ నికీషానే స్వయంగా పంచుకుంది. ఈ రోజుల్లో లిప్‌లాక్‌ గురించి అందాల భామలు ఇలా మాట్లాడడం ఆశ్చర్యంగానే ఉంది కదూ. అదీ సంగతి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS