హీరోయిన్ అమలా పాల్, ‘ఆమె’ సినిమాతో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. ఆ సినిమా సాధించిన కమర్షియల్ విజయం కంటే, అందులో ఆమె న్యూడ్‌గా కన్పించడమే.. ఆ సినిమాకి ఎక్కువ పాపులారిటీ తెచ్చిపెట్టిందన్నది నిర్వివాదాంశం. ఆ సంగతి పక్కన పెడితే, ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్‌లో ఓ సినిమా చేస్తోంది. మరోపక్క, దర్శకురాలిగా మారే ఆలోచనలో అమలాపాల్ వున్నట్లు తెలుస్తోంది. అమలా పాల్‌కి మొదటి నుంచీ దర్శకత్వం, నిర్మాణంపై ఆసక్తి ఎక్కువ. ‘ఆమె’ సినిమా రూపొందిస్తున్నప్పుడు, టెక్నికల్ అంశాలపై అవగాహన పెంచుకుందట.
స్క్రిప్ట్ దగ్గర్నుంచి, సినిమాటోగ్రఫీ వరకూ.. నిర్మాణ విషయాల్లోనూ మెలకువళ్ని ‘ఆమె’ సినిమా టైమ్లోనే నేర్చుకున్న అమలా పాల్ త్వరలో ఓ సినిమాకి దర్శకత్వం వహించాలనే ఆలోచన చేస్తోందని కోలీవుడ్‌లో గుసగుసలు విన్పిస్తున్నాయి. ‘ఆమె’ తరహాలోనే లేడీ ఓరియెంటెడ్ సినిమా ఇంకాస్త ఇంటెన్సిటితో తెరకెక్కించాలన్నది అమలా పాల్ ఆలోచనగా కన్పిస్తోంది. అదే నిజమైతే, అతి త్వరలోనే ఆమెను దర్శకురాలిగా మనం చూడొచ్చు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, పాన్ ఇండియా ఆలోచనలతో అమలా పాల్ ఈ సినిమా తెరకెక్కించబోతోందట. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.