విజయ్ దేవరకొండ ఏం చేసినా వెరైటీగా ఉంటుంది. స్పాంటెనిస్ గా స్పందించడం, తన ఫ్యాన్స్‌కి ట్విట్టర్ లో సదా టచ్‌లో ఉండడం విజయ్ ప్రత్యేకత. ఎప్పుడు ఎలాంటి సంఘటన జరిగినా, చురుగ్గా స్పందిస్తాడు. అయితే కరోనా విషయంలోనే పెద్దగా అప్‌డేట్ గా లేడు. యువ హీరోలంతా పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటిస్తే... విజయ్ దేవరకొండ నుంచి మాత్రం ఎలాంటి ప్రకటనా లేదు. విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలియంది కాదు. ఇటీవల కాలంలో బాగా సంపాదించిన యువ హీరోల్లో తానొకడు. అయినా సరే, ఇప్పటి వరకూ చిల్లి గవ్వ కూడా విదిలించలేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో విజయ్ దేవరకొండ ఎందుకు ఇలా ఉన్నాడా? అనే ప్రశ్న తలెత్తుతోంది.
అయితే విజయ్ సన్నిహితులు మాత్రం ఈ మౌనం వెనుక కొత్త అర్థాలు తీస్తున్నారు. ఇలాంటి వితప్కర సమయాలు ఇది వరకూ వచ్చాయని, అప్పుడు విజయ్ దేవరకొండ బాగానే స్పందించాడని, ఇప్పుడు కూడా ఓ పెద్ద ప్లాన్‌లో ఉన్నాడని, త్వరలోనే విజయ్ వంతు సాయం వివరాలు బయటకు వస్తాయని చెబుతున్నారు. విజయ్‌ది పెద్ద మనసే. తన ఫ్యాన్స్‌ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఈసారి కూడా పెద్ద మనసుతోనే స్పందిస్తాడేమో చూడాలి.