రవితేజ హీరోగా రూపొందిన 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమైపోయింది. ఆల్రెడీ సినిమా టీజర్ విడుదలయ్యింది. సాంగ్ ప్రోమోస్ కూడా సందడి చేస్తున్నాయి. సినిమాకి తొలుత జరిగిన ప్రచారానికీ, ఇప్పుడు జరుగుతున్న ప్రచారానికీ పొంతనే లేదు.
మొదట్లో సినిమా గురించి 'సీరియస్' టచ్ ప్రొజెక్షన్ చేశారు. ఇప్పుడు కామెడీతో కూడిన టచ్ వుందనే సంకేతాలు పంపుతున్నారు. తన మార్క్ కామెడీ సినిమా అంతటా వుంటుందనీ, సినిమాలో అమర్, అక్బర్, ఆంటోనీ.. ఈ మూడు పాత్రలూ విపరీతమైన కామెడీని జనరేట్ చేస్తాయనీ, ఆ పాత్రలతోపాటు సపోర్టింగ్ రోల్స్ పండించే కామెడీ అంతా ఇంతా కాదని దర్శకుడు శ్రీనువైట్ల స్వయంగా చెప్పాడు.
మరోపక్క, రవితేజ కూడా తన సినిమా నుంచి అందరూ ఆశించే ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఎలా మిస్ అవుతామని ప్రశ్నిస్తున్నాడు. ఇదొక కంప్లీట్ ప్యాకేజీ అనీ, సీరియస్ మోడ్‌లోనో, ఇంకో మోడ్‌లో మాత్రమే సినిమా నడుస్తుందనుకుంటే పొరపాటేనని తాజాగా ఇంటర్వ్యూల్లో శ్రీనువైట్ల, రవితేజ ప్రకటించడం గమనార్హం.
'సినిమాలో గ్లామర్ వుండదు' అనే ప్రచారం జరగడంతో, ఇలియానా 'గ్లామరస్ సాంగ్'ని బయటకు తీసుకొచ్చారు. ఆ బొద్దు గ్లామర్‌ని భరించడం కాస్త కష్టంగానే వుంది. మరి, కామెడీ సంగతేంటో! టీజర్‌ని చూస్తే, ఇదొక సీరియస్ థ్రిల్లింగ్ మూవీ అనే భావన కలిగింది. ఇంతకీ 'అమర్ అక్బర్ ఆంటోనీ' ఎలా వుంటుంది? సినిమా రిలీజ్ అయ్యేదాకా వేచి చూడక తప్పదు.