అమర్‌ అక్బర్‌ ఆంటోనీ ముగ్గరా? ఒక్కరా?

మరిన్ని వార్తలు

రవితేజ తాజా చిత్రం 'అమర్‌ అక్బర్‌ అంటోనీ' కాన్సెప్ట్‌ టీజర్‌ని విడుదల చేశారు. ఈ టీజర్‌లో అమర్‌ డల్‌గా ఓ రూంలో కూర్చుని ఉన్నాడు. అక్బర్‌ బైనాక్యులర్‌తో బిల్డింగ్‌ పైనుండి ఏదో చూస్తున్నాడు. ఆంటోనీ, టై విత్‌ నార్మల్‌ వేర్‌లో ఆఫీస్‌లో కాస్త టెన్షన్‌గా కనిపిస్తున్నట్లున్నాడు. ఈ కాన్సెప్ట్‌ పోస్టర్‌ని ఈ సినిమా దర్శకుడు శీను వైట్ల పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసింది చిత్ర యూనిట్‌. 

టైటిల్‌ని బట్టి రవితేజ మూడు విభిన్న పాత్రల్లో కనిపిస్తున్నాడని అర్ధమవుతోంది. అయితే ఈ సినిమాలో రవితేజ ఓ రకమైన డిజార్డర్‌తో బాధపడుతూ ఉంటాడట. సందర్భాన్ని బట్టి తనలోని మూడు వేరియేషన్స్‌ ఉన్న వ్యక్తులు బయటికి వస్తుంటారట. 'అపరిచితుడు' సినిమాలో విక్రమ్‌లా అన్న మాట. ఇది లేటెస్టుగా ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌గా ఈ మధ్య ప్రచారంలో ఉంది. అయితే నిజంగానే రవితేజ ఆ తరహా వ్యాధితో బాధపడతాడా? లేక ట్రిపుల్‌ రోల్‌లోనే కనిపిస్తాడా? అనేది ప్రస్తుతానికి సస్పెన్సే. 

ఒకవేళ రవితేజ ట్రిపుల్‌ రోల్‌ అయితే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్‌కి చోటుండాలి. ఇలియానా పేరు తప్ప మరో పేరు వినిపించడం లేదు. సో ఈ డౌట్‌కే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. చూడాలి మరి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం విడుదల తర్వాత కానీ అసలు విషయం తెలీదు. 

'రంగస్థలం'తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టిన ప్రముఖ బ్యానర్‌ మైత్రీ మూవీస్‌ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS