దసరా బరిలో ఫెస్టివల్‌ హీరో లేనట్లేనా.?

మరిన్ని వార్తలు

ఫెస్టివల్‌ వస్తోందంటే సైలెంట్‌గా తన సినిమాని విడుదలకు సిద్ధం చేసేస్తాడు యంగ్‌ హీరో శర్వానంద్‌. అక్కడ రేస్‌లో ఉన్నది స్టార్‌ హీరోనా, బ్లాక్‌ బస్టర్‌ హీరోనా? అనేది అస్సలు చూడడు. పోటీకి సై అంటాడంతే. అలాంటిది ఈ ఏడాది దసరాకి మనోడి నుండి సినిమా రావడం కష్టమేనని తెలుస్తోంది. 

పోయిన దసరాకి 'మహానుభావుడు' చిత్రంతో హిట్‌ కొట్టాడు. ఆ తర్వాత శర్వానంద్‌ నుండి ఈ దసరాకి సినిమా వస్తుందని అభిమానులు ఆశించారు. కానీ ఆ ఆశ తీరేలా లేదనిపిస్తోంది. శర్వానంద్‌ నటిస్తున్న 'పడి పడి లేచె' సినిమా ఇంకా ఇప్పుడప్పుడే ప్రేక్షకుల ముందుకు వచ్చేలా కనిపించడం లేదు. డిశంబర్‌లో ఈ సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారనీ తెలుస్తోంది. 

శర్వానంద్‌, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతోన్న ఈ సినిమాని హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నాడు. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పల్లెటూరి అందాలతో 'శతమానం భవతి' సినిమాతో మంచి హిట్‌ అందుకుని, అతి శుభ్రం అంటూ 'మహానుభావుడు' సినిమాతో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న శర్వానంద్‌ నుండి వస్తున్న తదుపరి చిత్రమిది. 

పక్కా రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. రొమాంటిక్‌ అండ్‌ చాక్లెట్‌ బోయ్‌లా శర్వానంద్‌. మోడ్రన్‌ అమ్మాయిలకు నచ్చే పాత్రలో సాయి పల్లవి ఈ సినిమాలో ప్రేక్షకుల్ని మెప్పించనున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS