బిగ్‌బాస్‌కే బాస్‌ అయిన మహేష్‌ హీరోయిన్‌.!

మరిన్ని వార్తలు

మహేష్‌ హీరోయిన్‌ ఏంటీ? బిగ్‌బాస్‌కి ఎవరైనా గెస్ట్‌ని తీసుకొస్తున్నారా.? అనుకుంటున్నారా.? కాదు కాదు.. మనం మాట్లాడుకుంటున్నది తెలుగు బిగ్‌బాస్‌ గురించి కాదులెండి. హిందీ బిగ్‌బాస్‌. తెలుగు, తమిళ భాషల్లో ప్రస్తుతం సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోన్న బిగ్‌బాస్‌ సీజన్‌ హిందీలోనూ వెరీ లేటెస్ట్‌గా స్టార్ట్‌ అయ్యింది. ఇప్పుడు కేవలం ఏ భాష వాళ్లు ఆ సీజన్‌నే ఫాలో అవ్వడం కాదు, మిగిలిన భాషల్లో సీజన్స్‌ని కూడా విచ్చలవిడిగా ఫాలో అయిపోతున్నారు.

 

తెలుగు బిగ్‌బాస్‌ చూస్తూనే తెలుగు ఆడియన్స్‌, తమిళ బిగ్‌బాస్‌లో ఏం జరుగుతోందా.? అని ఓ కన్నేస్తున్నారు. ఇక ఇప్పుడు మోస్ట్‌ సక్సెస్‌ ఫుల్‌ అయిన హిందీ బిగ్‌బాస్‌పైనా దృష్టి పెట్టేయనున్నారు. బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌గా హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌ 13 వెరీ లేటెస్ట్‌గా స్టార్ట్‌ అయ్యింది. 15 వారాల పాటు సాగే, ఈ బిగ్‌బాస్‌ సీజన్‌లో 13 మంది కంటెస్టెంట్స్‌ మాత్రమే ఉండనున్నారు, ఒక గెస్ట్‌తో సహా.

 

ఈ గెస్ట్‌ గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. ఇంతకీ ఈ గెస్ట్‌ ఎవరు.? బిగ్‌ హౌస్‌లో గెస్ట్‌కి ఏం పని.? అనుకుంటున్నారా.? ఆగండాగండి. వివరాల్లోకి వెళితే, హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌ 13కి హీరోయిన్‌ అమీషా పటేల్‌ని హౌస్‌కి గెస్ట్‌గా పంపించారు. తెలుగులో ఎన్టీఆర్‌, మహేష్‌ సరసన హీరోయిన్‌గా అమీషా పటేల్‌ సుపరిచితురాలన్న సంగతి తెలిసిందే. ఇంతకీ హౌస్‌లో గెస్ట్‌గా అమీషా ఏం చేస్తుందటా.? అంటే, హౌస్‌ని జాగ్రత్తగా ఓ కంట కనిపెడుతూ ఉంటుందట. అంటే, సహజంగా హౌస్‌లో బిగ్‌బాస్‌ వినిపిస్తాడంతే, కనిపించడు. అయితే, అమీషా కనిపించే బిగ్‌బాస్‌ అన్న మాట. హౌస్‌కి యజమానిగా అమీషా పటేల్‌ని హౌస్‌లోకి పంపించారు. ఇదిలా ఉంటే, ఈ సారి హిందీ బిగ్‌బాస్‌లో ఫైనల్స్‌ నాలుగు వారాల పాటు సాగనుందట. ఇట్స్‌ వెరీ ఇంట్రెస్టింగ్‌ కదా.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS