రౌడీస్టార్‌ అడ్వాంటేజ్‌ తీసుకుంటాడా.?

మరిన్ని వార్తలు

రౌడీస్టార్‌ తీరు మార్చుకోవాలంటూ కొందరు సన్నిహితులు ఆయనకు సలహాలు ఇస్తున్నారట. అయితే, ఏ విషయంలో రౌడీ తీరు మార్చుకోవాలన్నదే ప్రశ్న. మొదట్నుంచీ సమ్‌థింగ్‌ డిఫరెంట్‌ ఆటిట్యూడ్‌తో తనదైన ముద్ర వేసుకున్నాడు విజయ్‌ దేవరకొండ. ముఖ్యంగా యూత్‌లో రౌడీ వేసిన మార్క్‌ ప్రత్యేకమైనది. యూత్‌కి ఓ ట్రెండ్‌ సెట్టర్‌లా మారిపోయాడు విజయ్‌ దేవరకొండ. అదే కాన్ఫిడెన్స్‌తో ఫెయిల్యూర్స్‌ని కూడా పట్టించుకోకుండా, వరుస సినిమాలు చేస్తూ, కెరీర్‌ని ఫాస్ట్‌గా బిల్డప్‌ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు.

 

అయితే, విజయ్‌ దేవరకొండపై ఓ గాసిప్‌ చక్కర్లు కొడుతోంది. విజయ్‌ దేవరకొండ అన్నింట్లోనూ వేలు పెట్టేస్తాడనే ప్రచారం జరుగుతోంది. స్క్రిప్టులోనూ, స్క్రీన్‌ ప్రజెన్స్‌లోనూ తనకు నచ్చినట్లుగా మార్పులు చేయాలని దర్శ, నిర్మాతలకు సూచిస్తాడట. అలా వేలు పెట్టి కెలకడంతోనే ఆయన సినిమాలు ఫెయిల్‌ అవుతున్నాయని టాక్‌. అరతే కాదు, 'అర్జున్‌ రెడ్డి' తరహాలో ఏదో ఒక సిట్యువేషన్‌లో తన ప్రతీ సినిమాలోనూ గెటప్‌ ఉండాలని అంటాడట.

 

అయితే ఈ గాసిప్‌లో నిజమెంతో తెలీదు కానీ, అందుకే 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌'లోనూ 'అర్జున్‌ రెడ్డి'లా ఓ సిట్యువేషన్‌ కోసం రగ్గ్‌డ్‌ లుక్‌ మెయింటైన్‌ చేశాడనీ తెలుస్తోంది. అయితే, చాలా కొద్ది సేపు మాత్రమే ఈ లుక్‌ సినిమాలో ఉంటుందట. మూడు డిఫరెంట్‌ లుక్స్‌లో ఇదీ ఓ లుక్‌. అయితే, ఎక్కువ సేపు స్టార్ట్‌ లుక్‌లోనే విజయ్‌ దేవరకొండ కనిపిస్తాడట. రాశీఖన్నా, కేథరీన్‌, ఇసాబెల్లె.. ముగ్గురు ముద్దుగుమ్మలతో ఈ సినిమాలో మనోడు ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌కి రెడీ అవుతున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS