టాక్ ఆఫ్ ది వీక్‌: నిన్ను త‌ల‌చి, రామ‌చ‌క్క‌ని సీత‌, మిర్ర‌ర్‌, రాయ‌ల‌సీమ ల‌వ్ స్టోరీ

By Gowthami - September 29, 2019 - 12:01 PM IST

మరిన్ని వార్తలు

సాహోకీ సైరాకీ మ‌ధ్య సినిమాల జాత‌ర ఎక్కువ‌గానే క‌నిపించింది. గ్యాంగ్ లీడ‌ర్‌, గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ (వాల్మీకి)లాంటి క్రేజీ సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి. గ్యాంగ్ లీడ‌ర్ బిలో యావ‌రేజ్ స్థాయి ద‌గ్గ‌ర ఆగిపోతే, గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్ప‌టికీ గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్ మంచి వ‌సూళ్లు సాధిస్తూ ముందుకు దూసుకెళ్లిపోతున్నాడు. గ‌త వారం విడుద‌లైన‌.. బందోబ‌స్త్ డిజాస్ట‌ర్ లిస్టులో చేరిపోయింది.

 

ఈ వారం మ‌రో నాలుగు సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి.నిన్ను త‌ల‌చి రామ చ‌క్క‌ని సీత‌, మిర్ర‌ర్‌, రాయ‌ల‌సీమ ల‌వ్ స్టోరీ విడుద‌ల‌య్యాయి. అన్నీ చిన్న సినిమాలే. రాయ‌ల‌సీమ ల‌వ్ స్టోరీలో అడ‌ల్ట్ కంటెంట్ ఎక్కువ‌గా క‌నిపించింద‌ని టాక్‌. పోస్ట‌ర్లు కూడా హాట్ హాట్ గా ఉన్నాయి. నిన్ను త‌ల‌చి, రామ చ‌క్క‌ని సీత డీసెంట్ సినిమాలే. కాక‌పోతే.. వాటికి ప్ర‌మోష‌న్లు లేవు. మిర్ర‌ర్‌ని ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు. ఈ నాలుగు సినిమాల‌కు చాలా త‌క్కువ సంఖ్య‌లోనే థియేట‌ర్లు దొరికాయి. ఈ వీకెండ్ కూడా గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌కి మంచి వ‌సూళ్లు ద‌క్కాయి. ఆ సినిమాకి మించిన ఆప్ష‌న్ లేకుండా పోయింది. ఇక బుధ‌వారం సైరా వ‌చ్చేస్తోంది.

 

ఈ సినిమా గురించి టాలీవుడ్‌లో హాట్ హాట్ చ‌ర్చ న‌డుస్తోంది. బాహుబ‌లి రికార్డులు బ‌ద్ద‌లుకొడుతుంద‌ని కొంద‌రు, అది అసాధ్య‌మ‌ని మ‌రి కొంద‌రు పందాలు కాచుకుంటున్నారు. ఆ లెక్క‌న ఈవారం టాక్ ఆఫ్ ది టౌన్ సైరానే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS