'బిగ్‌బాస్‌ 2' ఎలిమినేట్‌ అయ్యేదెవరంటే.!

By iQlikMovies - August 30, 2018 - 15:07 PM IST

మరిన్ని వార్తలు

ఈ వీక్‌ ఎలిమినేషన్‌లో ఉన్నవారు కౌషల్‌, అమిత్‌, గణేష్‌, సామ్రాట్‌, నూతన్‌. ఈ వీక్‌ ఇద్దరు ఎలిమినేట్‌ అయ్యే అవకాశం ఉందట. ఆన్‌ లైన్‌ పోల్స్‌లో గణేష్‌, నూతన్‌లకు లీస్ట్‌ పోస్ట్‌లు వచ్చాయి. టాప్‌ ప్లేస్‌లో కౌషల్‌, అమిత్‌, సామ్రాట్‌ సేఫ్‌ జోన్‌లో ఉన్నట్లు ఆన్‌లైన్‌ పోల్స్‌ సూచిస్తున్నాయి. 

కానీ గణేష్‌ని షరా మామూలుగానే సేవ్‌ చేసేస్తారు అనే అభిప్రాయం కూడా కలుగుతోంది. కానీ ఇది బిగ్‌బాస్‌. ఇక్కడ ఏదైనా జరగొచ్చు కదా. ఏం జరుగుతుందో చూడాలి మరి. అయితే హౌస్‌లో గణేష్‌ ఓవరాక్షన్‌ ఈ మధ్య చాలా ఎక్కువైపోయిందనే నెగిటివ్‌ రిపోర్ట్స్‌ ఎక్కువగా వస్తున్నాయి. 

సామాన్యుడు కదా అని నెత్తికెక్కించుకుంటే, హౌస్‌లో ఏకు మేకై పోయాడు గణేష్‌ అంటూ సోషల్‌ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. దాంతో పాటు, ఊరికే కౌషల్‌పై గణేష్‌ విరుచుకుపడడం, అయినా కానీ హౌస్‌లో మిగిలిన హౌస్‌ మేట్స్‌ సపోర్ట్‌ గణేష్‌కే ఉండడం, హోస్ట్‌ నాని వైపు నుండి గణేష్‌కి వార్నింగ్స్‌ తప్ప ఎలిమినేషన్‌ నుండి ఎప్పటికప్పుడే సేవ్‌ అవుతుండడం చూస్తుంటే, ఈ సారి కూడా గణేష్‌ ఎలిమినేషన్‌కి పూర్తిగా గ్యారంటీ ఇవ్వలేమనిపిస్తోంది. 

అలా ఒకవేళ గణేష్‌ సేవ్‌ అయిపోతే, మరి ఈ వారం ఎలిమినేట్‌ అయ్యే ఆ ఇద్దరు హౌస్‌మేట్స్‌ ఇంకెవరై ఉంటారా? అని వీక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇంతకు ముందెన్నడూ లేనంత ఉత్కంఠ ఈ వారం ఎలిమినేషన్స్‌లో నెలకొంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS