'దేవదాస్‌' మరో గిఫ్ట్‌ నేడే విడుదల.!

మరిన్ని వార్తలు

నాగార్జున, నాని కాంబినేషన్‌లో రాబోతున్న 'దేవదాస్‌' సినిమా నుండి ఫస్ట్‌ సింగిల్‌ ఈ రోజు రిలీజ్‌ కానుంది. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా నిన్న అనగా ఆగస్టు 29న ఈ ఆడియో సింగిల్‌ రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ హరికృష్ణ హఠాన్మరణంతో వాయిదా వేశారు. అది ఈ రోజు సాయంత్రం రిలీజ్‌ చేసేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. 

శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌లో నిర్మితమవుతోన్న ఈ చిత్రం ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. నాని, నాగార్జున ఫుల్‌ ఎనర్జిటిక్‌ రోల్స్‌లో కనిపించనున్నారు. ఇద్దరికిద్దరూ పోటీపడి నటించారట. ధియేటర్స్‌లో నవ్వులు పూవులు పూయించేందుకు ఈ ఇద్దరూ సెప్టెంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇంతవరకూ ఫస్ట్‌ పెగ్‌ అంటూ విడుదల చేసిన టీజర్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఫస్ట్‌లుక్‌కీ రెస్పాన్స్‌ అదిరిపోయింది. మందు భాషలో విడుదలైన ఈ ప్రచార చిత్రాలు డిఫరెంట్‌గా ఆకట్టుకున్నాయి. 

ఇప్పుడు రాబోయే ఆడియో సింగిల్‌ని ఎలా డిజైన్‌ చేసి ఉంటారోనని అభిమానుల్లో ఆశక్తి నెలకొంది. రీసెంట్‌గా విడుదలైన నాగార్జున హ్యాండ్‌సమ్‌ లుక్‌ సూపర్బ్‌గా ఉంది. ఇక నానికి సంబంధించి సోలో లుక్‌ విడుదల చేయాల్సి ఉంది. 

నాని 'దాసు' అనే డ్టారు పాత్రలో కనిపిస్తున్నాడు. నాగార్జునది 'దేవా' అనే డాన్‌ పాత్ర. ఈ దేవా, దాసు కలిసి చేయబోయే అల్లరి ఎలా ఉండబోతోందో చూడాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. ఆకాంక్షసింగ్‌, రష్మికా మండన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS