సినిమా వాళ్ళు చక్రం తిప్పిన దేశం మనది. ఎంతో మంది ఫిల్మ్ స్టార్స్ రాజ్యమేలారు. కానీ కొందరికి మాత్రం పాలిటిక్స్ అచ్చిరాలేదు. అందులో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పేర్లు చెప్పుకొవచ్చు. ఈ విషయాన్ని స్వయంగా వాళ్ళే ఒప్పుకున్నారు. అయితే చిరు కంటే అమితాబ్ ముందుగా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయనకి పాలిటిక్స్ పరిస్థితి అర్ధమైయింది. చిరంజీవి పాలిటిక్స్ లోకి వెళ్తానని చెప్పినపుడు అమితాబ్ 'వద్దు' అని సలహా ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా అమితాబే చెప్పారు.
'సైరా' ప్రమోషన్ లో బాగంగా ముంబాయి వెళ్ళారు చిరంజీవి. అక్కడ బిగ్ బిగ్, చిరు కలసి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో చాలా ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. చిరంజీవిని మొదట ఎక్కడ కలిశారు ? అనే ప్రశ్నకు బిగ్ బి బదులిస్తూ.. ''ఊటీలో మొదటిసారి చూశా. ఓ డ్యాన్స్ బిట్ ని కంపోజ్ చేయగా.. అది సింగెల్ టేక్ లో చేయడం చూసి షాక్ అయిపోయా. ఇప్పటివరకూ ప్రయత్నిస్తూనే వున్నా. అలాంటి స్టెప్ వేయలేకపోయా(నవ్వుతూ). అలా ఏర్పడిన మా పరిచయం స్నేహంగా మారింది.
చాలా విషయాలు మాట్లాడుకుంటాం. కొన్ని సలహాలు కూడా ఇచ్చా. పాలిటిక్స్ లో వస్తా అంటే ''వద్దు'' అని చెప్పా. (చిరు నవ్వుతూ.. సారీ అమితాబ్ జీ.. ఈ విషయంలో చాలా రిగ్రేట్ ఫీలౌతున్నా). వీళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయం చెప్పా. కానీ వినలేదు. అయితే పవన్ కళ్యాణ్ లో చాలా ఇంటెన్సిటీ వుంది. అతను ఏదైనా చేస్తాడేమో చూడాలి'' అని చెప్పుకొచ్చారు అమితాబ్. అమితాబ్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పినప్పుడు.. 'పవన్ కళ్యాణ్ కి పాలిటిక్స్ కరెక్ట్. హీ డిజర్స్ దట్' అని చిరు చెప్పడం ఆసక్తికరంగా అనిపించింది.