లెజెండరీ యాక్టర్ బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కి చుక్కెదురైంది.
వివరాల్లోకి వెళితే, ముంబైలోని బీఎంసీ వారు తాజాగా అమితాబ్ బచ్చన్ తో కలిపి మరో ఆరుగురికి నోటీసులు అందచేసింది. ఆ నోటీసులు ఎందుకు అనగా తూర్పు గోరేగావ్ లోని ఫిలిం సిటీకి సమీపాన గల తమ నివాసాల వద్ద కార్పొరేషన్ అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టడంతో వీరికి నోటీసులు అందచేశారు.
వీరు త్వరలోనే ఈ నోటీసుల పైన స్పందించాల్సిఉంది అని తెలుస్తున్నది. అమితాబ్ తో పాటుగా ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ కూడా ఈ నోటీసులు అందుకున్న జాబితాలో ఉన్నారు.
ఈ అంశం పై వీరివురు నుండి ఇంకా ఎటువంటి ప్రకటనా రాలేదు.