'సైరా' షూటింగ్‌లో బిగ్‌బీ బిజీ బిజీ

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ దిగ్గజం బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ 'సైరా నరసింహారెడ్డి' షూటింగ్‌కి హాజరయ్యారు. ఇటీవలే 'సైరా' చిత్రంలో తన పాత్ర తాలూకు గెటప్‌ ఈ రకంగా ఉండబోతోందంటూ ఓ ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు అమితాబ్‌. 

తెల్లని గుబురు గెడ్డంతో, కురు వృద్ధుడిగా కనిపిస్తున్న అమితాబ్‌ ఫోటో నెట్‌ వైరల్‌ అయ్యింది. చిరంజీవి 151వ చిత్రంగా తెరకెక్కుతోన్న 'సైరా నరసింహారెడ్డి' చిత్రంలో అమితాబ్‌ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. మొట్ట మొదటి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నాడు. స్టైలిష్‌ డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. పలు భాషల్లోని ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

బాలీవుడ్‌ నుండి బిగ్‌బీతో సహా, కన్నడ నటుడు సుదీప్‌, తమిళ నటులు విజయ్‌ సేతుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు ఈ సినిమాలో. ఆల్రెడీ మొదటి షెడ్యూల్‌ పూర్తయ్యింది. రెండో షెడ్యూల్‌ స్టార్ట్‌ అయ్యింది. తాజాగా అమితాబ్‌ 'సైరా' సెట్స్‌లో సందడి చేస్తున్నారు. పరుచూరి బ్రదర్స్‌ సుదీర్ఘ కాలం పాటు రీసెర్చ్‌ చేసి, ప్రిపేర్‌ చేసిన స్టోరీ 'సైరా నరసింహారెడ్డి'. సౌత్‌ క్వీన్‌ నయనతార ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇంకా పలువురు నటీనటులు ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 

2019లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS