కోర్టుకెక్కిన వ‌ర్మ 'మ‌ర్డ‌ర్‌' కేసు

By Gowthami - August 05, 2020 - 09:58 AM IST

మరిన్ని వార్తలు

ఎప్పుడూ ఏదో ఓ వివాదాల్లో ఉండ‌డం రాంగోపాల్ వ‌ర్మ‌కి అల‌వాటు. మొన్న‌టి వ‌ర‌కూ `ప‌వ‌ర్ స్టార్‌` గోల న‌డిచింది. ఇప్పుడు అమృత - ప్ర‌ణ‌య్‌ల గాథ‌పై ప‌డ్డాడు. దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టించిన ప్ర‌ణ‌య్ హ‌త్య పై వ‌ర్మ ఇప్పుడు ఓ సినిమా తీశాడు. దానికి `మ‌ర్డ‌ర్‌` అనే పేరు పెట్టాడు. ఈ సినిమా విష‌యంలో ముందు నుంచీ అమృత అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తోంది. వ‌ర్మ‌ని ఉద్దేశించి సోష‌ల్ మీడియాలో ఓ పోస్టు కూడా పెట్టింది. అది బాగా వైర‌ల్ అయ్యింది.


ఇప్పుడు ఈ విష‌యంపైనే కోర్టుకెక్కింది. త‌న పేరునీ, త‌న ఫొటోల్నీ వాడుకుంటూ, ఓ క‌ల్పిత క‌థ తీస్తున్నాడంటూ వ‌ర్మ‌పై, ఆ సినిమా నిర్మాత‌ల‌పై న‌ల్గొండ న్యాయ స్థానంలో కేసు ఫైల్ చేసింది. ఈనెల 6న ఈ కేసు విచార‌ణ‌కు రానుంది. `మ‌ర్డ‌ర్‌` సినిమా నిర్మాత‌లు ఈనెల 6న కోర్టుకు హాజ‌రుకానున్నారు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS