షార్ట్ ఫిల్మ్స్ లాంటి సినిమాలు తీసి, ఏటీటీ ద్వారా బాగానే సొమ్ము చేసుకుంటున్నాడు వర్మ. అయితే.. తన కంటెంట్‌లో ఎప్పటిలానే కాంట్రవర్సీ పాయింట్ ఉండేలా చూసుకుంటూ - జనాల్ని ఆకర్షిస్తున్నాడు. ఇటీవల వర్మ తెరకెక్కించిన `పవర్ స్టార్` బాగానే లాభాల్ని తీసుకొచ్చింది. ఇప్పుడు తన దృష్టి అల్లు అరవింద్ పై పడిందని సమాచారం.
అల్లు అరవింద్ పై వర్మ ఓ సినిమా తీయబోతున్నాడట. టైటిల్ ఏమిటో తెలుసా? `అల్లు`. ప్రజారాజ్యం సమయంలో ఆ పార్టీ లో అల్లు అరవింద్ పాత్రేమిటో ఈ సినిమాలో వ్యంగంగా చూపించబోతున్నాడట. అప్పట్లో ప్రజారాజ్యంలో అల్లు డామినేషన్ ఎక్కువగా ఉండేదని ఇప్పటికీ రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. అల్లూ వైఖరి ప్రజారాజ్యం ఫ్లాప్‌కి ప్రధాన కారణమని అంటుంటారు. ఆ పాయింట్ తోనే వర్మ సినిమా తీయబోతున్నాడట. పైగా ఆమధ్య వర్మని బ్యాన్ చేయాలని.. ఆయన ఓ మీటింగ్ పెట్టి, వర్మపై నిప్పులు చెరిగారు. ఆ కోపాన్ని తీర్చుకోవడానికి వర్మకి ఓ అవకాశం దక్కిందన్నమాట.