హాట్‌ సమ్మర్‌లో హీటు పుట్టిస్తున్న 'అమీ జాక్సన్'

మరిన్ని వార్తలు

ఓ పక్క భానుడి ప్రతాపం. మరో పక్క అందాల భామ అమీజాక్సన్‌ బికినీ సోయగం. రెండూ పోటీ పడుతూ, చూసే కుర్రకారును హీటు సంద్రంలోకి నెట్టేస్తున్నాయ్‌. 'రోబో 2.0' సినిమాలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సరసన నటించిన ముద్దుగుమ్మ ప్రస్తుతం ఆ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తోంది. అదలా ఉంటే, ఇదిగో సమ్మర్‌ వెకేషన్‌ని ఇంత రిలాక్స్‌డ్‌గా ఎంజాయ్‌ చేస్తోంది. అమీజాక్సన్‌ ధరించిన బ్లాక్‌ అండ్‌ వైట్‌ బికినీ సొగసులను చూసి తట్టుకోవడం కొంచెం కష్టమే మరి.

ఆ రేంజ్‌లో హాట్‌నెస్‌ పొందుపరిచింది అందులో. టూ పీస్‌ బికినీలు అమీజాక్సన్‌కి కొత్తేమీ కాదు కానీ, ఎందుకో ఈ సారి మాత్రం తెగ సెగలు పుట్టించేస్తోందిలే. తన పదహారవయేటే మోడలింగ్‌ రంగంలో అడుగుపెట్టిందీ బ్రిటీష్‌ భామ. తర్వాత తమిళంలో 'మదరాసి పట్నం' సినిమాతో సినీ కెరీర్‌ను ప్రారంభించింది. తమిళంతో పాటు, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ కన్నడంలో 'ది విలన్‌' చిత్రంలో నటిస్తోంది. హిందీలో ఓ సినిమా చేస్తోంది. సినిమా సంగతిటుంచితే, అప్పుడప్పుడూ సోషల్‌ మీడియాలో తన గాజుకళ్లతో హాట్‌ అప్పీల్‌తో కుర్రకారుకు గాలమేస్తూ ఉంటుంది. హాట్‌ హాట్‌ కాస్ట్యూమ్స్‌తో కుర్రోళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.

అందులో భాగంగానే ఈ తాజా ఫోటో హల్‌చల్‌ చేస్తోంది. నెట్టింట్లోకి వచ్చాక ఊరికే ఉంటుందా.. లైకుల మీద లైకులు, షేర్లు మీద షేర్లు అబ్బో ఈ ఫోటో ఇప్పుడు తెగ వైరల్‌ అయ్యిపోయిందిలే.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS