ప్రముఖ హీరోయిన్ అమీ జాక్సన్ లండన్ లో షూటింగ్ లో ఉండగా గాయపడినట్టు తెలుస్తుంది.
వివరాల్లోకి వెళితే, ఒక యాడ్ షూటింగ్ లో భాగంగా వీధుల్లో పరిగెత్తుతునప్పుడు ఆమె కాలికి గాయమైనట్టు సమాచారం. అయితే ఆ గాయాన్ని లెక్క చేయకుండా షూటింగ్లో పాల్గోనేసరికి ఆ గాయం తీవ్రమయింది.
ఇక వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరిలించి చికిత్స అందచేశారు. అయితే డాక్టర్లు ఒక వారం పాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది అని చెప్పడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.