కమల్ హసన్ సోదరుడు చంద్రహాసన్ (82) ఈ తెల్లవారుజామున మృతి చెందారు.
అందుతున్న వివరాల ప్రకారం, లండన్ లోని తన కుమార్తె అను హసన్ నివాసంలో గుండెపోటుతో మరణించారు. మొన్న జనవరి నెలలోనే ఆయన సతీమణి గీతామణి మృతి చెందడంతో ఆయన తన కూతురి దగ్గర నివసిస్తునట్టు సమాచారం.
ఆయన రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఈ విషయం తెలియడంతో కమల్ కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది.