అయ్యో అమీ ఆ ఛాన్స్‌ మిస్‌ చేసుకుందే.!

మరిన్ని వార్తలు

బ్రిటీష్‌ భామ అమీజాక్సన్‌కి బంపర్‌ ఛాన్స్‌ మిస్‌ అయ్యింది. రాజమౌళి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌'కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ ఒకటి చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పాత్ర బ్రిటీష్‌ యువతిని ప్రేమిస్తాడు.

 

ఆ పాత్ర కోసం రాజమౌళి అన్నీ ఆలోచించే హాలీవుడ్‌ భామ డైసీ ఎడ్గర్‌ జైన్‌ని తీసుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తూ ఆ భామ పర్సనల్‌ కారణాలతో రాజమౌళికి హ్యాండిచ్చింది. దాంతో ఇప్పుడా పాత్ర సందిగ్థంలో పడింది. ఎంత మందినో రాజమౌళి ఈ లిస్ట్‌లో యాడ్‌ చేస్తున్నాడు కానీ, సెట్‌ అవ్వడం లేదు. సరిగ్గా ఇదే టైంలో అందరి మదిలోనూ మెదిలిన భామ అమీజాక్సన్‌. ఇటీవల లేడీ రోబోగా పర్‌ఫెక్ట్‌ పర్‌ఫామెన్స్‌ ఇచ్చింది '2.0'లో అమీజాక్సన్‌. అయితే ప్రస్తుతం సినిమాల నుండి టెంపరరీ బ్రేక్‌ తీసుకుని పర్సనల్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తోంది. ఏదో లవ్‌లోనో, డేటింగ్‌లోనో ఉండి ఎంజాయ్‌ చేస్తే ఫర్వాలేదు. ఆమె అడిగినంత రెమ్యునరేషన్‌ ఇచ్చి అయినా 'ఆర్‌ఆర్‌ఆర్‌' కోసం తీసుకొచ్చేవాడే రాజమౌళి. అయితే అందాల అమీజాక్సన్‌ తల్లి కాబోతోంది. సో ఈ టైంలో ఆమెను సంప్రదించేందుకే అవకాశం లేదు. అలా ఈ బంపర్‌ ఆఫర్‌ని అమీజాక్సన్‌ మిస్‌ చేసుకున్నట్లయ్యింది. గతంలో అమీజాక్సన్‌ '1947 లవ్‌స్టోరీ' సినిమాలో బ్రిటీష్‌ యువతి పాత్రలో నటించి మెప్పించింది.

 

ఇండియన్‌ పోరాట యోధుడి పాత్రలో ఆర్య నటించాడు ఆ సినిమాలో. ఇంచుమించు అదే తరహా పాత్ర అయిన ఎన్టీఆర్‌కి అమీ అయితే పర్‌ఫెక్ట్‌ మ్యాచ్‌ అయ్యుండేదని అంతా భావిస్తున్నారు. కానీ ఏం చేస్తాం.? ఎన్టీఆర్‌ జోడీ ఎప్పటికి కుదిరేనో.? ఎవరితో కుదిరేనో.? చూడాలిక. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS