ముద్దుగుమ్మ అమీజాక్సన్ 'రోబో 2.0'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. గెటప్ లేడీ రోబో అయినప్పటికీ హాట్‌నెస్ మాత్రం అన్‌లిమిటెడ్ అట ఈ సినిమాలో. ఇంతకు ముందు శంకర్ దర్శకత్వంలో నటించిన 'ఐ' చిత్రంలోనూ అమ్మడి గ్లామర్‌కి కుర్రోళ్లు మనసు పారేసుకున్నారు. మామూలుగానే శంకర్ సినిమాల్లో హీరోయిన్స్ అందంగా కనిపిస్తూనే గ్లామర్‌లో శృతిమించిపోతారు. ఇక హద్దులే లేకపోతే ఇంకేముంది. అమీజాక్సన్ విషయంలో అంతే. సినిమా సంగతి అలా ఉంచితే ఈ బ్యూటీ అప్పుడప్పుడూ హాట్ హాట్ ఫోటో సెషన్స్‌తో సోషల్ మీడియాలో దర్శనమిస్తూ ఉంటుంది. తాజాగా ఇదిగో ఈ పిక్‌లో అమీజాక్సన్ హాట్‌నెస్‌కి ఆకాశమే హద్దన్నట్లుగా లేదూ. హాట్‌నెస్‌తో పాటు, సూపర్ ట్రెండీగా ఉంది ఈ కాస్ట్యూమ్‌లో అమీజాక్సన్. కాస్ట్యూమ్ ఒకెత్తు, ఆమె స్టైల్ ఇంకో ఎత్తు. ఏమాటకామాటే చెప్పాలి అందగత్తెలు.. హాట్ అప్పియరెన్స్.. ఆస్వాదించే ఆడియన్స్.. ఆహా! ఆ కిక్కే వేరప్పా!