మెహరీన్‌కి లక్‌ కుదిరింది కానీ

మరిన్ని వార్తలు

'కృష్ణగాడి వీర ప్రేమగాధ' సినిమాతో తొలి ఎంట్రీతోనే హిట్‌ కొట్టి లక్కీ గాళ్‌ అయిపోయింది ముద్దుగుమ్మ మెహరీన్‌కౌర్‌. ఆ సినిమా హిట్‌ అయ్యింది. హీరోయిన్‌గా టాలెంట్‌ పరంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత అవకాశాలే రాలేదు ఈ బ్యూటీకి అనుకునేంతలో ఇదిగో వస్తున్నా అంటూ వరుస పెట్టి సినిమాలతో వచ్చేసింది. ఈ ఏడాది 'మహానుభావుడు' సినిమాతో బోణీ కొట్టింది. విజయం అందుకుంది. ఆ వెంటనే 'రాజా ది గ్రేట్‌'తో వచ్చింది. అది కూడా సక్సెసే. 

తాజాగా 'కేరాఫ్‌ సూర్య' సినిమాతో మరో విజయం తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలన్నీ లెక్కకు విజయాలే. కానీ అమ్మడిని అంతగా కేర్‌ చేస్తున్నట్లు కనిపించడం లేదు. పేరుకే సక్సెస్‌ కానీ, స్టార్‌ ఇమేజ్‌ రావడం లేదు అమ్మడికి. ఒక్క సినిమాకే రాత్రికి రాత్రి స్టార్స్‌ అయిపోతున్నారు. కానీ ఈ ముద్దుగుమ్మ లక్‌ ఏంటో తెలీదు కానీ, వరుసగా అన్ని సినిమాలూ పోజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ, అంతగా రిజిస్టర్‌ కావడం లేదు ఎందుకో. ఇక మిగిలింది త్వరలో రాబోతున్న 'జవాన్‌'. సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రమిది. ఈ సినిమాతో ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది మెహరీన్‌.  

తొలి సినిమా 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' తెచ్చిన గుర్తింపు కూడా ఈ ఈ మూడు సినిమాల ద్వారా రాలేదు ఈ బొద్దుగుమ్మకి. అంతేకాదు ఒక్కో సినిమాలో ఒక్కో రకంగా కనిపించింది ఈ భామ. తొలి సినిమాలో క్యూట్‌గానే కనిపించినా, తాజా చిత్రాల్లో కొంచెం బొద్దుగా కనిపించింది. అయితే జవాన్‌లో ఎలా ఉండబోతోందో చూడాలి మరి. ఎలా ఉన్నా కానీ సక్సెస్‌ తెచ్చిపెట్టే తృప్తి వేరేలా ఉంటుంది. ఆ రకమైన తృప్తి ఈ ముద్దుగుమ్మకి ఏ సినిమాతో దక్కనుందో చూడాలి మరి. ఈ లక్కీ బ్యూటీకి అసలు సిసలు లక్కు కుదిర్చే సినిమా ఏదవుతుందో!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS