ఇట్స్‌ హారర్‌ టైం: సమంత కాదు భూమిక

మరిన్ని వార్తలు

'ఖుషి' సినిమాతో భూమిక యూత్‌కి డ్రీమ్‌ గాళ్‌ అయిపోయింది. హీరోయిన్‌గా ఎంతో మంది కుర్రకారు గుండెల్లో లవ్లీ డాళ్‌గా చోటు సంపాదించుకున్న భూమిక కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉండి, ఈ మధ్యనే రీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీలో భూమిక, నాని నటించిన 'ఎంసీఏ' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకించింది. వస్తూ వస్తూనే క్రేజీ ఆఫర్స్‌ దక్కించుకుంటోంది. 

'ఎంసీఏ'లో నానికి వదినగా నటించిన భూమిక, తదుపరి నాగచైతన్య హీరోగా వస్తున్న 'సవ్యసాచి' సినిమాలో చైతూకి అక్క పాత్రలో కీలక పాత్ర పోషించనుంది. ఇవన్నీ కాక తాజాగా భూమిక ఖాతాలో మరో క్రేజీయెస్ట్‌ ఆఫర్‌ దక్కిందనీ సమాచారమ్‌. అదీ ఒక దెయ్యం పాత్రట. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న 'యూ టర్న్‌' సినిమాతో భూమిక దెయ్యంగా కనిపించబోతోందని సమాచారమ్‌. 

రీ ఎంట్రీ ఇస్తూనే ఓ ఇంటర్వ్యూలో భూమిక చెప్పింది. ఇకపై తాను ఎంచుకునే పాత్రలన్నీ చాలా డిఫరెంట్‌గా ఉంటాయనీ. అందులో భాగంగానే భూమిక ఈ దెయ్యం పాత్రకు ఓకే చేసిందనీ తెలుస్తోంది. కన్నడలో ఘన విజయం సాధించిన 'యూ టర్న్‌' చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రీమేక్‌ చేస్తున్నారు. జర్నీ నేపథ్యంలో హారర్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఒరిజినల్‌ని తెరకెక్కించిన పవన్‌కుమార్‌ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. 

క్రేజీ గాళ్‌గా కుర్రకారు మనసు కొల్లగొట్టిన భూమిక క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఆల్రెడీ 'ఎంసీఏ'తో ఆకట్టుకుంది. ఇక అదీ దెయ్యంగా తన క్యూట్‌ ఫేస్‌కి హారర్‌ టచ్‌ ఇచ్చి, ఆడియన్స్‌ని ఎలా భయపెట్టనుందో చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS