సందీప్ కిషన్ - అమైరా దస్తూర్ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'మనసుకు నచ్చింది'. ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. అయితే ఈ చిత్రంలో సందీప్ కిషన్, అందాల భామ అమైరా దస్తూర్ మధ్య కెమిస్ట్రీ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. బార్బీ బొమ్మలా ఉండే అమైరా దస్తూర్‌కి ఇదే తొలి తెలుగు చిత్రం. కానీ సినిమా ప్రోమోస్ చూస్తుంటే, అచ్చమైన తెలుగమ్మాయిలా అందంగా ఆకట్టుకుంటోంది.
ఇక అసలు విషయానికి వస్తే, సందీప్ కిషన్‌కి 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' సినిమా మంచి విజయాన్ని అందించింది. ఆ తర్వాత మరే సినిమా ఆ స్థాయిలో విజయాన్నివ్వలేదు. కానీ సినిమాపై అంచనాలున్నాయి. సినిమాలో అమైరా - సందీప్ కిషన్ జంట చూడచక్కడా ఎట్రాక్ట్ చేస్తోంది. ప్రోమోస్‌లో వీరిద్దరి కెమిస్ట్రీ అదరిపోతోంది. రొమాంటిక్ సీన్స్‌లో వీరిద్దరూ చాలా కంఫర్ట్‌గా నటించారట. ఈ సినిమాలో నేను చాలా హోమ్లీగా, ట్రెడిషనల్లగా కనిపిస్తానని అమైరా దస్తూర్ చెబుతోంది కానీ ప్రోమోస్ చూస్తుంటే అలా లేదు. సూపర్ రొమాంటిక్‌గా అనిపిస్తున్నాయి. రొమాంటిక్ ఎంటర్టైనర్గానే ఈ సినిమా తెరకెక్కుతోంది.
హీరోయిన్ని హాట్‌గా చూపిస్తూనే, ఎట్ ది సేమ్ టైమ్ పక్కింటి అమ్మాయి అనే ఫీల్ కలిగించేలా చూపించారు డైరెక్టర్. నటిగా, నిర్మాతగా తానేంటో ప్రూవ్ చేసుకున్న సూపర్ స్టార్ మహేష్‌బాబు సోదరి మంజుల ఈ చిత్రంతో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్‌లుక్ దగ్గర్నుంచీ, ప్రతీ పోస్టర్నీ చాలా ఆహ్లాదంగా, అందరి మనసుకు నచ్చేలా డిజైన్ చేశారు. చూడాలి మరి సినిమా రిజల్ట్ ఎలా ఉండనుందో!