డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్-యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలయికలో వచ్చిన టెంపర్ చిత్రం విడుదలై నేటికి సరిగ్గా మూడు సంవత్సరాలు.
మూడు సంవత్సరాల ముందు తమతమ కెరీర్ లో ఫ్లాప్స్ చూస్తూ హిట్ కోసం ఎదురుచూస్తున్న పూరి-ఎన్టీఆర్ లకి ఈ టెంపర్ చిత్రం ఒక మరుపురాని చిత్రంగా మిగిలిపోయింది. ఈ సినిమాకి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఈ చిత్రానికి కథ అందించింది వక్కంతం వంశీ. తొలిసారిగా తన కెరీర్ లో వేరే అతను ఇచ్చిన కథని డైరెక్ట్ చేశాడు పూరి జగన్నాధ్.
అలాగే హీరో ఎన్టీఆర్ కూడా ప్రతినాయక లక్షణాలు ఉన్న పాత్రని ఈ చిత్రంలో పోషించాడు. ఈ సినిమా మొత్తానికి ఆయువుపట్టు అయిన క్లైమాక్స్ ఒక అద్బుతం అని చెప్పొచ్చు. అలాగే హీరో పాత్రని తీర్చిదిద్దిన తీరు, భాస్కరభట్ల అందించిన సాహిత్యం, అనూప్ రూబెన్స్ సాహిత్యం ఈ చిత్రాన్ని మరో మెట్టుపైకి తీసుకెళ్ళాయి.
ఈ చిత్రానికి వచ్చిన మొత్తం కలెక్షన్స్ ఈ సినిమా స్టామినాకి న్యాయం చేయలేదు అన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. ఎందుకంటే ఈ సినిమా గనుక సరైన సమయంలో విడుదలై ఉంటే రూ 50కోట్ల మార్కుని అందుకుని ఉండేది అన్నది అందరి అంచనా.
ఏదేమైనప్పటికీ.. ఫ్లాపుల పర్వంలో ఉన్న ఇద్దరు వ్యక్తులకి లైఫ్ ఇచ్చిన సినిమాగా ఈ టెంపర్ ఎప్పటికి గుర్తుండిపోతుంది. చీర్స్ తో టెంపర్.