అందాల అమైరా ఈ సారేం చేసేనో.!

మరిన్ని వార్తలు

'మనసుకు నచ్చింది' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల అమైరా దస్తూర్‌. తొలి సినిమాలో క్యూట్‌ ఫీచర్స్‌తో, అక్కడక్కడా హాట్‌ హాట్‌ సింకింగ్స్‌తో హుషారెత్తించింది. ప్రోమోస్‌తో సెగలు పుట్టించిన ఈ బ్యూటీకి సినిమా విడుదలయ్యాక ఆశించిన రిజల్ట్‌ రాకపోవడంతో రేస్‌లో వెనక్కి వెళ్లిపోయింది. 

గ్లామర్‌లో తనకేం గీతలు లేవంటూ అమ్మడు వస్తూ వస్తూనే చెప్పేయడంతో, తొలి సినిమాలోనే చూపించాల్సిందంతా చూపించింది. కానీ వర్కవుట్‌ కాలేదు. అందుకే సెకండ్‌ ట్రైల్‌ కోసం త్వరలోనే వచ్చేస్తోంది. యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌తో 'రాజుగాడు' సినిమాలో నటిస్తోంది ముద్దుగుమ్మ అమైరా దస్తూర్‌. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమాలోని ప్రోమోస్‌ని ఒక్కొక్కటిగా వదులుతున్నారు చిత్ర యూనిట్‌. ఆ ప్రోమోస్‌లో చిన్న గౌనులేసుకుని ఈ పెద్ద పాప అలా అలా నడిచొస్తుంటే, కుర్రకారుకు ఇలా ఇలా గుండె జారి గల్లతయిపోతోంది మరి. 

గ్లామర్‌కి లిమిట్స్‌ లేవు. యాక్టింగ్‌లోనూ అమ్మడు ఫర్వాలేదనిపించింది. ఇక రావాల్సింది అసలు సిసలు హిట్‌ ఒక్కటే. మొదట్లో హ్యాట్రిక్‌ హీరోగా పేరు తెచ్చుకున్న రాజ్‌తరుణ్‌కి ఇప్పుడు అంతగా కలిసి రావడం లేదు. వరుస ఫ్లాపులతో నిరాశపరుస్తున్నాడు. అయితే ఈ సారి 'రాజుగాడు' సినిమాపై ఈ ఇద్దరూ భారీగా ఆశలు పెట్టుకున్నారు. సినిమా ఎలాగైనా హిట్‌ అవుతుందని ఈగర్‌గా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ హిట్‌ అయితే ఈ ఇద్దరికీ సంక్రాంతి పండగే. చూడాలి మరి ఏం జరుగుతుందో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS