ప్రముఖ హిందీ హీరో అర్జున్ రాంపాల్ తన భార్య అయిన మెహర్ నుండి విడాకులు తీసుకోబోతున్నట్టుగా గత సంవత్సర కాలం నుండి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ వార్తల పైన అర్జున్ కాని మెహర్ కాని నోరు విప్పలేదు.
అయితే కొద్దిసేపటి క్రితమే అర్జున్-మెహర్ లు సంయుక్తంగా ఒక ప్రెస్ నోట్ ని విడుదల చేశారు. ఈ ప్రెస్ నోట్ ప్రకారం, ఈ ఇరువురు విడాకులు తీసుకున్నట్టు అయితే ఇది తాము కోరుకున్నది కాదు అని, తప్పని పరిస్థితుల దృష్ట్యా ఇలా జరిగింది అని చెప్పుకొచ్చారు.
తమ పిల్లలకి తాము ఎప్పుడు ఉంటాము అని అలాగే ఒకరికోసం ఒకరు కూడా తాము ఎప్పటికి ఉంటాము అని స్పష్టం చేశారు. తమ 20 ఏళ్ళ అనుబంధం ముగుస్తున్న వేళ తమ వ్యక్తిగత జీవితం పైన ఇక ఎటువంటి వార్తాలు రాయకండి అని విజ్ఞప్తి చేస్తూ ఇక ఈ అంశం పైన ఏమి మాట్లాడబోము అని చెప్పారు.
ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో విడాకుల తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతున్నది. ఈ మధ్యనే హ్రితిక్ రోషన్, ఫర్హాన్ అఖ్తర్ లు కూడా తమ వైవాహిక జీవితం నుండి బయటకి వచ్చేశారు.