అమైరా దస్తూర్ అంటే గుర్తొచ్చేది క్యూట్ ఫీచర్స్. హాట్ అప్పీల్. అయితే ఇప్పుడు అమైరా దస్తూర్ బాగా మారిపోయింది. ఓ డిఫరెంట్ గెటప్‌లో కనిపించబోతోంది. బాలీవుడ్లో అమైరా దస్తూర్ నటిస్తున్న 'రాజ్మా చావల్' సినిమా కోసం ఓ సరికొత్త గెటప్‌లో దర్శనమివ్వబోతోంది అమైరా దస్తూర్. లీనా యాదవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాలోని అమైరా దస్తూర్ గెటప్ గురించే అంతా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా డిఫరెంట్ కట్లో హెయిర్ స్టైల్ చేయించుకుందట ఈ సినిమా కోసం అమైరా దస్తూర్. గెటప్పే కాదు, బాడీ లాంగ్వేజ్‌తో పాటు ఆమె నటన కూడా చాలా కొత్తగా ఉండబోతోందట. దర్శకురాలు లీనా యాదవ్ అమైరా దస్తూర్ నుండి బెస్ట్ అవుట్ పుట్ రాబట్టిందట. అంతేకాదు, ఇంతవరకూ ఇండియన్ స్క్రీన్ మీదే ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమా రాలేదని బాలీవుడ్ వర్గాల్లో చర్చలు వినిపిస్తున్నాయి.
అసలింతకీ ఈ ముద్దుగుమ్మ 'రాజ్మా చావల్'తో ఏం ప్రయోగం చేస్తుందో ఏమో కానీ, సినిమాకి అప్పుడే బోలెడంత హైప్ క్రియేట్ అయిపోయింది. మరో వైపు అమైరా దస్తూర్ బాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. 'రాజ్మా చావల్'తో పాటు 'మెంటల్ హై క్యా', 'మేడిన్ చైనా' చిత్రాల్లోనూ అమైరా నటిస్తోంది.
తెలుగులో 'మనసుకు నచ్చింది' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత 'రాజుగాడు' చిత్రంలో నటించింది. రెండు చిత్రాలూ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. అయితేనేం బాలీవుడ్లో దుమ్ము దులిపేస్తోందీ క్యూట్ అండ్ హాటీ అమైరా దస్తూర్.