ఫలానా ఫెయిర్‌నెస్ క్రీమ్ రాసుకోండి తెల్లగా అవుతారు. ఉదయం నుండీ సాయంత్రం దాకా ఫ్రెష్‌గా ఉంటారు. ఈ బ్యూటీ క్రీమ్‌తో మీ అందం రెట్టింపు అవుతుంది.. అంటూ అందాల భామలు ప్రమోషన్స్ చేస్తుంటారు. సబ్బులు, ఫెయిర్‌నెస్ క్రీమ్స్ ఇలా రకరకాల బ్యూటీ ఐటెమ్స్‌కి హీరోయిన్లు బ్రాండ్ అంబాసిడర్స్‌గా వ్యవహరిస్తుంటారు. అయితే ఇకపై ఇలాంటివి ఇక కనిపించవేమో.
ఎందుకంటారా? రంగు అందం కాదు అనే విషయంపై కొన్ని రీసెర్చ్‌లు జరుగుతున్నాయి. అలాగే అందాల భామలు కూడా రంగుతోనే అందం అనే ప్రయత్నాన్ని విరమించుకోవాలనే ప్రచారంలో నిమగ్నమయ్యారు. రంగు అందానికి ఏ రకమైన అడ్డంకి కాదని వారు నమ్ముతున్నారు. దాంతో అందాల భామలు బ్యూటీ ఐటెమ్స్‌కి బ్రాండ్ అంబాసిడర్స్‌గా వ్యవహరించేందుకు నిరాకరిస్తున్నారట. ఇప్పటికే చాలా మంది ముద్దుగుమ్మలు వీటి విషయంలో వెనక్కి తగ్గారు. కోట్లలో డీల్స్‌ని కూడా వదిలేసుకుంటున్నారట.
తాజాగా ముద్దుగుమ్మ అమైరా దస్తూర్ ఇలాంటి ఓ బ్యూటీ క్రీమ్ యాడ్‌లో నటించేందుకు నిరాకరించింది. అలాగే బాలీవుడ్ నుండీ, పలువురు ముద్దుగుమ్మలు ఈ తరహా వాణిజ్య ప్రకటనలకు నో చెబుతుండడం విశేషం. సైంటిఫిక్ రీసెర్చ్‌ల ద్వారా కూడా అందానికి క్రీములు పనికి రావనే విషయం తేలిపోయింది. అంతేకాదు కాన్సర్ తదితర రోగాలకు ఈ బ్యూటీ క్రీములు కారకాలుగా మారుతున్నాయి. క్రీములు రాయడంతో నల్లగా ఉన్నవారు తెల్లగా మారతారు అని చేస్తున్న ప్రచారంతో, నల్లగా వున్న వారిని సదరు యాడ్‌లో నటించిన ముద్దుగుమ్మలు అవమానిస్తున్నారంటూ వాదిస్తున్నారు కూడా.
దాంతో ముద్దుగుమ్మలు ఎందుకొచ్చిన తలనొప్పిలే అనుకుని, వారు ముందుగానే జాగ్రత్త పడుతున్నారు. ఒకవేళ ఇలాంటి వాణిజ్య ప్రకటనలకు వారు ఒప్పుకున్నా వివాదాల్లో చిక్కక తప్పడం లేదు. దాంతో ఈ తరహా యాడ్స్‌కి బ్యూటీస్ రువైపోతున్నారు. ముద్దుగుమ్మల్లో వచ్చిన ఈ ఆటిట్యూడ్ మెచ్చుకోదగ్గదే!