విలక్షణ నటుడు విక్రమ్ నటించిన తాజా చిత్రం 'స్వామి 2'. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. విక్రమ్‌కి తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ఆయన నటించిన 'అపరిచితుడు' తదితర చిత్రాలు తెలుగులో మంచి ఆదరణ పొందడంతో పాటు, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు కూడా రాబట్టాయి.
15 ఏళ్ల కిందట విక్రమ్ నటించిన 'సామి' చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇన్నాళ్ల తర్వాత ఆ సినిమాకి సీక్వెల్ వస్తోంది. 'సింగం' సిరీస్‌తో తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్న హరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. హిట్ బ్యూటీ కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. 'మహానటి' సూపర్ డూపర్ హిట్ తర్వాత కీర్తి సురేష్ నటిస్తున్న చిత్రమిది.
యాక్షన్ సీన్స్ కోసం కీర్తిసురేష్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకుందట. చాలా స్టైలిష్ లుక్‌లో డిఫరెంట్‌గా కనిపిస్తోంది కీర్తిసురేష్. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. హాలీవుడ్ రేంజ్‌లో విజువల్ అదరగొట్టేశారు. విక్రమ్ మంచి నటుడు. ఆ సంగతి అందరికీ తెలిసిందే.
అయితే ఈ సినిమాలో విక్రమ్‌లోని కొత్త కోణాన్ని సరికొత్తగా ఆవిష్కరించాడు డైరెక్టర్ హరి. రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకి ప్రధాన ఆకర్షణ కానుంది.