ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రానున్న 'అరవింద సమేత..' సినిమా పాటల సందడి మొదలైంది. ఫస్ట్ ఆడియో సింగిల్‌ని రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేసింది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఫస్ట్ ఆడియో సింగిల్ రానుంది.
'అనగనగా..' అంటూ సాగే ఈ లిరికల్ సాంగ్‌కి తమన్ మ్యూజిక్ అందించగా, అర్మన్ మాలిక్ ఆలపించారు. దసరాకి విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ని అతి త్వరలో రూపొందించేందుకు ఆలోచన చేస్తున్నారు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఎన్టీఆర్ రాయలసీమ కుర్రాడి గెటప్‌లో కనిపించనున్నారు. రాయలసీమ యాసను బాగా అవుపాసన పట్టారు. సిక్స్ ప్యాక్ బాడీతో సరికొత్త స్టైలిష్ లుక్‌లో ఎన్టీఆర్ కనిపించబోతున్నారన్న సంగతి ఆల్రెడీ టీజర్ ద్వారా అర్ధమైంది.
ఇక స్టోరీ పరంగానూ త్రివిక్రమ్ ఏదో మ్యాజిక్ చేయబోతున్నాడనీ తాజాగా అందుతోన్న సమాచారమ్. ఈ మధ్య 'అరవింద సమేత..' నుండి అనుకోకుండా బయటకు వచ్చిన లీకేజ్ ఫోటోల కారణంగా చిత్ర యూనిట్ షూటింగ్ స్పాట్‌లో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. సెట్స్‌లోకి సెల్‌ఫోన్లు అనుమతించడం లేదు. హారికా, హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌లో రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
హాట్ బ్యూటీ పూజా హెగ్దే తొలిసారి ఎన్టీఆర్‌తో జత కడుతోంది. 'సాక్ష్యం' సినిమాలో బక్కపలుచగా కనిపించిందన్న కామెంట్స్‌తో ఈ సినిమా కోసం కొంచెం బొద్దుగా ముద్దుగా మారిందట. పూజాతో పాటు తెలుగమ్మాయి ఈషారెబ్బ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తోంది.