అంచనాలు పెంచేస్తోన్న 'ఎన్టీఆర్‌'

మరిన్ని వార్తలు

క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర్‌' సినిమాలోని ఒక్కో క్యారెక్టర్‌ లుక్‌నీ రివీల్‌ చేసుకుంటూ వస్తున్నాడు డైరెక్టర్‌ క్రిష్‌. ఈ సినిమాకి లీడ్‌ రోల్స్‌ అయిన ఎన్టీఆర్‌ పాత్రధారిలో బాలయ్యబాబు నటిస్తుండగా, ఆయన అల్లుడు నారా చంద్రబాబు పాత్రను రానా పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ మామా అల్లుళ్ల లుక్స్‌తోనే సినిమాపై అంచనాలు బాగా పెరిగిపోయాయి. 

క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం అంటే ఆ స్థాయి ఎలా ఉంటుందో 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమాతోనే చూసేశాం. అందులోనూ ఇంత ప్రతిష్ఠాత్మక చిత్రం తెలుగువాడు అందరివాడు స్వర్గీయ నందమూరి తారకరామారావు బయోపిక్‌ అంటే క్రిష్‌ ఆ సినిమాని ఏ రేంజ్‌లో ఆవిష్కరిస్తాడో ఊహించడమే కష్టం. ముఖ్యంగా బయోపిక్స్‌ని రూపొందించేటప్పుడు పాత్రల ఎంపిక, ఆ పాత్ర చిత్రీకరణకు ప్రాధాన్యత ఎక్కువ. నారా చంద్రబాబుగా రానాని తీర్చి దిద్దిన విధానం చూస్తేనే మిగిలిన పాత్రల చిత్రీకరణ ఇంకెలా ఉండబోతోందో అర్ధం చేసుకోవచ్చు. 

ఎన్టీఆర్‌ జీవితంలో ఆయన భార్య బసవతారకం పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. వాస్తవానికి ఆమె గురించి అభిమానులకు తెలిసింది చాలా తక్కువ. ఆమె పాత్రలోని భావోద్వేగాల్ని ఈ సినిమాలో హైలైట్‌గా చూపించనున్నారట. అందుకే అంత బరువైన పాత్ర కాబట్టే ఆ పాత్రకు ఏరికోరి విద్యాబాలన్‌ని ఎంచుకోవడం జరిగింది. 

అలాగే సుమంత్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, మోహన్‌బాబు తదితరుల పాత్రలను ఆయా పాత్రల కోసం క్రిష్‌ ఎంచుకున్న తీరు మెచ్చుకోదగ్గది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS